వాస్తవ సంఘటనలతో...

suicide club movie trailer show - Sakshi

‘మజిలీ’ ఫేమ్‌ శివ రామాచద్రవరపు లీడ్‌ రోల్‌లో ప్రవీణ్‌ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘సూసైడ్‌ క్లబ్‌’. శ్రీనివాస్‌ బొగడపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రవీణ్, ప్రభు, వెంకటేశం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రం ట్రైల్‌ షోను నిర్వహించారు చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ‘‘నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించాను. స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. యాక్టర్స్‌ అందరూ పాత్రలకు పక్కాగా సూట్‌ అయ్యారు’’ అన్నారు. ‘‘తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాం. రాత్రి, పగలు షూటింగ్‌ చేశాం. మా ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాం’’ అన్నారు శివ.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top