శ్రీనువైట్లకు హీరో దొరికాడా! | Sakshi
Sakshi News home page

శ్రీనువైట్లకు హీరో దొరికాడా!

Published Wed, Feb 20 2019 12:10 PM

Srinu Vaitla Next Movie With Hero Manchu Vishnu - Sakshi

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ఇటీవల ఆ ఫాం కోల్పోయాడు. ఆగడు సినిమా నుంచి వరుస ఫ్లాప్‌లు ఎదురు కావటంతో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు హీరోలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. తాజాగా అమర్‌ అక్బర్‌ ఆంటొనితో మరో ఫ్లాన్‌ ఎదురుకావటంతో శ్రీనువైట్లకు నెక్ట్స్‌ ఏ హీరో చాన్స్‌ ఇస్తాడన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యంగ్ హీరో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట.

మంచు ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు కామెడీ సినిమాలతో సూపర్‌హిట్లు సాధించాడు. ఇటీవల కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనకు ఢీ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందించిన శ్రీనువైట్లతో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా ఢీకి సీక్వల్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ సినిమాతో అయిన శ్రీనువైట్ల హిట్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement