‘అందుకే అతన్ని వివాహం చేసుకున్నాను’

Sonam Kapoor Reveals Why She Married Anand Ahuja - Sakshi

సోనమ్‌ కపూర్‌ - ఆనంద్‌ అహుజ రెండు నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన దగ్గర నుంచి ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అంశాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. సోనమ్‌ కపూర్‌ అంటేనే ఫ్యాషన్‌ ఐకాన్‌. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆనంద్‌ అహుజా కూడా ఫ్యాషన్‌ ప్రియుడే. ఫ్యాషన్‌ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందింటున్నారు సోనమ్‌. ఈ విషయం గురించి సోనమ్‌ తన ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు.

దానిలో ‘ఫ్యాషన్‌ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిన విషయమే. నేను ఆనంద్‌ను వివాహం చేసుకుంది కూడా ఈ కారణం వల్లే. ఎందుకంటే ఆనంద్‌ ఫ్యాషన్‌ రంగంలో, రిటైల్‌ రంగంలో స్థిరపడిన వ్యక్తి కాబట్టి నాకు తొందరగా నచ్చాడు. ఫ్యాషన్‌ పట్ల ఉన్న ఆసక్తి వల్లే మేము ఇద్దరం వివాహం చేసుకున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆనంద్‌ అహుజా ఢిల్లీకి చెందిన రిటైల్‌ వ్యాపారి. అంతేకాక దేశంలో తొలి మల్టీ బ్రాండ్‌ ‘స్నీకర్‌’ బోటిక్‌ను ప్రారంభించింది కూడా ఆనంద్‌ అహుజానే. దీంతోపాటు ‘భనే’ అనే బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు.

ఈ ఏడాది మే 8న సోనమ్‌ కపూర్‌ - ఆనంద్‌ అహుజా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే సోనమ్‌ ‘క్యాన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2018’లో పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top