శిల్ప ఇంట్లో దీపావళి అదిరింది | Sakshi
Sakshi News home page

శిల్ప ఇంట్లో దీపావళి అదిరింది

Published Tue, Nov 10 2015 6:35 PM

శిల్ప ఇంట్లో దీపావళి అదిరింది

సినిమాల్లో ఎంత మోడ్రన్ గా కనిపించినా పండుగలప్పుడు మాత్రం బాలీవుడ్ తారలు సంప్రదాయాలను పాటిస్తూ చూడముచ్చటగా ఉంటారు. పండుగలను ఘనంగా జరుపుకుంటారు. అయితే శిల్పాశెట్టి  నివాసంలో దీపావళి పండుగ ముందుగానే వచ్చింది. సోమవారం రాత్రి  కుటుంబ సభ్యులతోపాటు బాలీవుడు ప్రముఖ తారలతో కుంద్రా ఇల్లు వెలిగిపోయింది.

శిల్ప ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు హాజరైన పలువురు తారలు తమ ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో తమ ఎంజాయ్మెంట్ను ఫొటోల రూపంలో పంచుకుంటున్నారు. దీపావళి వేడుకలకు హాజరైనవారిలో శ్రీదేవి, కూతురు ఖుషీ, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఈషా డియోల్ దంపతులు, షాహిద్ కపూర్, సోనమ్ కపూర్, సునీల్ శెట్టి, కరణ్ జొహార్, మనీష్ మల్హోత్ర, మికా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారలంతా కలిసి దిగిన సెల్ఫీలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

 

Advertisement
 
Advertisement
 
Advertisement