
తమిళనాట ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించింది 96. విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయవంతం కావడంతో అక్కడ త్రిష హవా పెరిగిపోయింది. టాలీవుడ్‌లో ఈ రీమేక్‌పై పలు వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
శర్వానంద్, సమంత జంటగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. 96 మూవీ డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించనున్నాడు. మార్చిలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు.
Happy to announce our Production No. 34 starring Sharwanand and @Samanthaprabhu2. Directed by C. Prem Kumar. Shoot starts this March. #SVC34 pic.twitter.com/aerY4bNTEX
— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2019