మా అమ్మాయిని షూటింగ్‌కి పంపను | Shakti Kapoor will not allow daughter Shraddha to resume work | Sakshi
Sakshi News home page

మా అమ్మాయిని షూటింగ్‌కి పంపను

Jun 13 2020 6:08 AM | Updated on Jun 13 2020 6:08 AM

Shakti Kapoor will not allow daughter Shraddha to resume work - Sakshi

శ్రద్ధాకపూర్‌, శక్తీ కపూర్‌

‘‘పని ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. అయితే ప్రాణాలను పణంగా పెట్టేంత ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేనైతే బయటికి వెళ్లి పని (షూటింగ్‌) చేయను. మా అమ్మాయి (శ్రద్ధాకపూర్‌)ని కూడా షూటింగ్‌ చేయడానికి అనుమతించను’’ అంటున్నారు బాలీవుడ్‌ బడా విలన్‌ శక్తీ కపూర్‌. ‘ఇక సినిమా, టీవీ షూటింగ్స్‌ చేసుకోవచ్చు’ అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సినీపరిశ్రమవారికి అనుమతి ఇస్తున్నాయి. కొన్ని నియమ నిబంధనలు కూడా విధించాయి. మహారాష్ట్రలో షూటింగులు మొదలయ్యాయి కూడా. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా షూటింగ్స్‌లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు శక్తీ కపూర్‌. ‘‘భయం (కరోనా) అనేది మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. మనతోపాటే ఉంది. ముందు ముందు మరింత ప్రమాదం పొంచి ఉంది.

అందుకే నా పిల్లలను మాత్రం బయటకు పంపను. ఇండస్ట్రీలోని మా గ్రూప్‌లో ఉన్న కొంతమందితో ‘ఆరోగ్యపరమైన సమస్య వచ్చి హాస్పిటల్‌లో చేరి బిల్లులు కట్టేకన్నా కొంతకాలం వేచి ఉండటం మంచిది’ అని చెప్పాను. ఎందుకంటే బయటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు శక్తీ కపూర్‌. కరోనా బారినపడినవారి సంఖ్య పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్‌ కొరత ఏర్పడుతోంది. ఇదే విషయం గురించి శక్తీ కపూర్‌ మాట్లాడుతూ – ‘‘హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేవు. పైగా హాస్పిటల్‌లో జాయిన్‌ అయితే బిల్‌ బాంబ్‌లా మోత మోగిపోతుంది. చికిత్స చేయించుకుని హాస్పటల్‌ బిల్‌ కట్టలేకపోవడంతో ఒక వ్యక్తిని తాడుతో కట్టేశారని ఈ మధ్య న్యూస్‌లో చూశాను. దీని గురించి ఓ వీడియో చేయబోతున్నాను. ప్రపంచం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మానవీయత అనేది లేదేమో అనిపిస్తోంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement