చైనాలో ఎదురులేని ఆమిర్‌..మరో భారీ రికార్డు | Secret Superstar Breaking Out Hugely In China | Sakshi
Sakshi News home page

Jan 20 2018 9:49 AM | Updated on Jan 20 2018 11:52 AM

Secret Superstar Breaking Out Hugely In China - Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌కు చైనా వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఆమిర్‌ ఖాన్‌ ’దంగల్‌’  చైనాలో రికార్డుస్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. రెజ్లింగ్‌ నేపథ్యంగా తెరకెక్కిన ‘దంగల్‌’ సినిమా చైనాలో 1200కోట్లకుపైగా (193 మిలియన్‌ డాలర్లు) వసూలు చేసింది.

ఆమిర్‌ ఖాన్‌ తాజా సినిమా ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ కూడా చైనాలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజే ఈ సినిమా భారీస్థాయిలో 6.79 మిలియన్‌ డాలర్లు (రూ. 43.35 కోట్లు) వసూలు చేసింది. తద్వారా శుక్రవారం విడుదలైన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ చైనా బాక్సాఫీస్‌ వద్ద నంబర్‌ స్థానాన్ని సొంతం చేసుకుంది. ‘దంగల్‌’ సినిమాను మించి ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. ఇది సెన్సేషనల్‌ హిట్‌ అంటూ సినీ అనలిస్ట్‌ తరన్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

జైరా వసీం, ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’కు అక్కడి వెబ్‌సైట్లు 9.6 వరకు రేటింగ్‌లు ఇచ్చాయి. దీంతో చైనా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా పట్ల అమితమైన క్రేజ్‌ నెలకొంది. చైనాలో సాధించిన భారీ వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా ‘దంగల్‌’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement