సింగర్ గా మారిన సంపూర్ణేష్‌బాబు | Sampoornesh Babu to turn s singer | Sakshi
Sakshi News home page

సింగర్ గా మారిన సంపూర్ణేష్‌బాబు

Feb 14 2015 12:07 AM | Updated on Sep 2 2017 9:16 PM

సింగర్ గా మారిన సంపూర్ణేష్‌బాబు

సింగర్ గా మారిన సంపూర్ణేష్‌బాబు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు సింగర్ గా మారాడు. 'కొబ్బరి మట్ట' సినిమా కోసం గొంతు సవరించాడు.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు సింగర్ గా మారాడు. 'కొబ్బరి మట్ట' సినిమా కోసం గొంతు సవరించాడు. దీంతో గాయకులుగా మారిన నటుల జాబితాలో చోటు సంపాదించాడు. హీరోలు పాటలు పాడడం ఇటీవలకాలంలో ట్రెండ్ గా మారింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ పాటలు పాడి అభిమానులను అలరించారు. సంపూర్ణేష్‌ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు.

సంపూ పాడిన పాటను ఇంటర్నెట్ లో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. 'కొబ్బరిమట్ట'లో సంపూర్ణేష్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడు అనే విభిన్న పాత్రల్లో అతడు కనిపించనున్నాడు. 'హృదయకాలేయం'తో సంచలనం సృష్టించిన సంపూర్ణేష్ 'కొబ్బరిమట్ట'తో తన హవా కొనసాగించాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement