డైనమిక్‌ జర్నలిస్ట్‌ | Samantha, Aadhi's U-Turn kick-starts 2nd schedule | Sakshi
Sakshi News home page

డైనమిక్‌ జర్నలిస్ట్‌

Apr 23 2018 12:21 AM | Updated on Jul 14 2019 1:28 PM

Samantha, Aadhi's U-Turn kick-starts 2nd schedule - Sakshi

సమంత

జోరున వర్షం పడుతోంది. ఓ లేడీ జర్నలిస్ట్‌ స్కూటర్‌ డ్రైవ్‌ చేస్తూ హడావిడిగా వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్నారేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఆమె డైనమిక్‌ జర్నలిస్ట్‌. అందుకే ఓ ఇన్వెస్టిగేషన్‌ వర్క్‌పై నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. నెక్ట్స్‌ ఏం జరిగింది? అంటే.. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? థియేటర్స్‌లో చూస్తేనే కదా ఫుల్‌ మజా. పవన్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన కన్నడ హిట్‌ ‘యు–టర్న్‌’ సినిమాను అదే టైటిల్‌తో, సేమ్‌ డైరెక్టర్‌తో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు.

సమంత, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. జర్నలిస్ట్‌ పాత్రలో సమంత, పోలీస్‌ ఆఫీసర్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. సమంత బాయ్‌ ఫ్రెండ్‌గా రాహుల్‌ కనిపించనున్నారని సమాచారం. ఇటీవల ప్రారంభమైన సెకండ్‌ షెడ్యూల్‌లో పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో సమంత, ఆది పినిశెట్టి పాత్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  మరో వారం పాటు ఈ షెడ్యూల్‌ జరగనుందని సమాచారం.శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాదే యు–టర్న్‌ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement