ప్రభాస్‌... సల్మాన్‌... ఓ హిందీ సినిమా? | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌... సల్మాన్‌... ఓ హిందీ సినిమా?

Published Wed, Jun 14 2017 12:24 AM

ప్రభాస్‌... సల్మాన్‌... ఓ హిందీ సినిమా?

ప్రేక్షకులను ఎవరూ ఫూల్స్‌ చేయలేరు! కథ లేకుండా గ్లామర్, గాల్లో ఎగిరే ఖరీదైన కార్లు, మోడ్రన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను ఫూల్స్‌ చేయలేమంటున్నారు సల్మాన్‌ ఖాన్‌. ఈ స్టేట్మెంట్‌లో స్పెషల్‌గా ఎవరి పేరూ లేకున్నా... షారూక్‌ ఖాన్‌ ‘దిల్‌ వాలే’పై సల్మాన్‌ సెటైర్స్‌ వేశాడని ముంబయ్‌ జనాలు చెప్పుకుంటున్నారు. దర్శకుడు రోహిత్‌ శెట్టి తీసిన ‘దిల్‌ వాలే’ ఆశించినంత హిట్టవ్వలేదు. అందులో సల్మాన్‌ సెటైర్స్‌ వేసినవన్నీ ఉన్నాయి.

ఆ మాటకొస్తే ఈ దర్శకుడి ప్రతి సినిమాలోనూ గ్లామర్, గాల్లో ఎగిరే కార్లు, యాక్షన్‌ కంపల్సరీ. అలాంటి రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ప్రభాస్, సల్మాన్‌ ఖాన్‌ హీరోలుగా మల్టీస్టారర్‌ సినిమా ప్లానింగ్‌లో ఉందని ముంబయ్‌లో ఓ వార్త షికారు చేస్తోంది. అదీ సల్మాన్‌ పైన స్టేట్మెంట్‌ ఇచ్చిన టైమ్‌లోనే! నిజం చెప్పాలంటే... భారీ మల్టీస్టారర్స్‌ తీయడంలో రోహిత్‌ శెట్టి స్పెషలిస్ట్‌. ‘దిల్‌ వాలే’ ఆశించినంత హిట్టవ్వలేదు గానీ... ‘బోల్‌ బచ్చన్‌’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘గోల్‌మాల్‌’ సిరీస్‌ నిర్మాతలకు లాభాలు తెచ్చాయి. రోహిత్‌ ట్రాక్‌ రికార్డు చూస్తే... ప్రభాస్, సల్మాన్‌లు సినిమా చేయొచ్చు. ఏం జరుగుతుందో మరి!! వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement
 
Advertisement
 
Advertisement