పండగకి అల్లుడొస్తున్నాడు

Sailaja Reddy Alludu release date fixed - Sakshi

‘శైలజారెడ్డి అల్లుడు’ వచ్చే టైమ్‌ ఫిక్స్‌ అయింది. సెప్టెంబర్‌ 13న అల్లుడు థియేటర్లలోకి రానున్నాడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఎస్‌. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కావాల్సింది.

అయితే ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కేరళలో జరుగుతుండటం.. అక్కడ వరదల వల్ల ఆటంకం ఏర్పడటంతో విడుదలను వాయిదా వేశారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 13న ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో చైతూ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top