నేను చాలా ఫాస్ట్‌

sahoo team shopping in abudabi - Sakshi

అమ్మాయిలు షాపింగ్‌కు వెళితే గడియారం అలా తిరిగిపోతుందంటారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు అబ్బాయిలు కూడా షాపింగ్‌లో గంటలు గంటలు గడుపుతున్నారు. అయితే కొంతమంది అబ్బాయిలు మాత్రం టీ–20లో బ్యాట్స్‌మెన్‌లా ఫటాఫట్‌ ధనాధన్‌ స్టైల్‌ని ఫాలో అవుతారు... గంటలో షాపింగ్‌ను ముగించేస్తారు. ప్రభాస్‌ కూడా ఇలాంటి టైపే. ‘సాహో’ షెడ్యూల్‌ కోసం ప్రభాస్‌ దుబాయ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి షాపింగ్‌ మాల్స్‌లో ‘సాహో’ టీమ్‌లో కొందరు షాపింగ్‌ చేస్తే, ప్రభాస్‌ మాత్రం ‘నో షాపింగ్‌’ అంటున్నారు.

ఈ సందర్భంగా తన షాపింగ్‌ అలవాటు గురించి ప్రభాస్‌ చెబుతూ –‘‘ఎంత పెద్ద మాల్‌కి వెళ్లినా నేను తొందరగానే షాపింగ్‌ ముగించేస్తా. నాక్కావాల్సినవి చాలా ఫాస్ట్‌గా సెలెక్ట్‌ చేసేసుకుంటా. మాగ్జిమమ్‌ గంటలోపే నాకు కావాల్సినవి కొనుక్కుంటాను. షాపింగ్‌కు డబ్బు ఎక్కువ పెడుతున్నానా? తక్కువ ఖర్చు చేస్తున్నానా? అని ఆలోచించను’’ అని పేర్కొన్నారు ప్రభాస్‌. ఇక ‘సాహో’ సినిమా విషయానికొస్తే.. సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు  ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. రీసెంట్‌గా అబుదాబి షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసిన ఈ టీమ్‌ నెక్ట్స్‌ షెడ్యూల్‌ను వచ్చే నెల సెకండ్‌ వీక్‌లో హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తోందని టాక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top