గ్రాండ్‌ ఎంట్రీ?

rrr movie shooting in pune - Sakshi

ప్రస్తుతం చిన్ని బ్రేక్‌లో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ త్వరలో నార్త్‌ ఇండియాకు పయనం కానున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్స్‌ పుణే, అహ్మదాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలిసింది.

అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌కు పాతిక కోట్లు, రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌కు పదిహేను కోట్ల రూపాయలను టీమ్‌ కేటాయించిందట. ఆల్రెడీ రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో చరణ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చి ఎన్టీఆర్‌పై చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తారట. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు తండ్రి పాత్రలో అజయ్‌ దేవగణ్‌  నటించనున్నారని తాజా సమాచారం. ఈ నార్త్‌ ఇండియా షెడ్యూల్స్‌లోనే ఆలియా, అజయ్‌ పాల్గొంటారట. సముద్రఖని, రాహుల్‌రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top