చీఫ్‌ మినిస్టర్‌ చద్దా

Richa Chadha Finishes Shooting for Madam Chief Minister - Sakshi

బాలీవుడ్‌ నటి రీచా చద్దా చీఫ్‌ మినిస్టర్‌గా మారారు. తన లేటెస్ట్‌ సినిమా ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’లో ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారామె. సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో అక్షయ్‌ ఒబెరాయ్, సౌరభ్‌ శుక్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి రీచా చద్దా మాట్లాడుతూ – ‘‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ సినిమా మా అందరి కష్టం. నా కెరీర్‌లోనే ఇదో చాలెంజింగ్‌ పాత్ర. ఈ అవకాశం ఇచ్చిన సుభాష్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ సినిమా జూలై 17న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top