ఈ భామల పారితోషికం ఎంతో తెలుసా?

Remunerations And Success Ratings of Samantha And Nayantara - Sakshi

సినిమా: తారల మార్కెట్‌ అయినా, పారితోషికాలు అయినా వారి సక్సెస్‌ రేటింగ్‌ను బట్టే ఉంటాయి. అయితే కథానాయికల మార్కెట్‌కు కాలపరిమితులు ఉంటాయి. ఎక్కువ కాలం వారు ప్రైమ్‌ టైమ్‌లో కొనసాగడం కష్టతరమే. అయితే నటి నయనతార, సమంత వంటి వారు ఆ పరిధిని దాటేశారనే చెప్పాలి. ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్న నటి నయనతార. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పలు ఆటంకాలను అధిగమించి హీరోయిన్‌గా తన క్రేజ్‌ను కాపాడుకుంటూ వస్తోంది. అందుకు అదృష్టం కలిసొస్తోందనే చెప్పాలి. లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకి స్థాయికి ఎదిగిన నయనతార పారితోషికం ఎంతో తెలుసా? చిత్రానికి అక్షరాలా రూ.కోట్లు పుచ్చుకుంటుందట. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే చేతి నిండా చిత్రాలతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలులేనంత బిజీగా ఉన్న నయనతార ఈ మధ్య వాణిజ్య ప్రకటనల్లోనూ నటించడం మొదలెట్టింది.

అలాంటి చిత్రాల్లో ఒకటి రెండు రోజుల్లో నటించేస్తుంది. అందుకు ఈ సంచలన నటి పుచ్చుకుంటున్న పారితోషికం రూ.3 కోట్లు అట. ఇప్పుడు ఆశ్చర్యపోకండి. వాణిజ్య ప్రకటనలకు ఇంత పారితోషికం పుచ్చుకుంటున్న దక్షిణాది నటి నయనతారనేనట. ఇక మరో క్రేజీ నటి సమంత. ఈ బ్యూటీ గ్రోత్‌ను చూసి ఎవరైనా ఆహా అని అనుకోకండా ఉండలేరు. పెళ్లైతే హీరోయిన్‌ పనంతే అనే అపవాదును బ్రేక్‌ చేసిన నటి సమంత. వివాహానంతరం హీరోయిన్‌గా బిజీగా ఉంటూ వరుస విజయాలను సాధిస్తున్న నటి ఈ అమ్మడు. ఇక ఈ సుందరి వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది. అందుకు ఈ ముద్దుగుమ్మ డిమాండ్‌ చేస్తున్న పారితోషికం రూ.2 కోట్లని తెలిసింది. డబ్బు చెట్లకు కాస్తాయా అంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ బ్యూటీస్‌ కాల్‌షీట్స్‌కు మాత్రం రాలుతున్నాయి. ఇలానే నటి అనుష్క, కాజల్‌అగర్వాల్, అమలాపాల్, తమన్నా లాంటి సుందరీమణులు యాడ్‌ ప్రపంచంలోనూ సంపాదించుకుంటున్నారు. ఫేస్‌ వ్యాల్యూ అంటే ఇదేమరి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top