నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే | Ready To Indefinite hunger strike | Sakshi
Sakshi News home page

నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే

Apr 19 2017 12:38 AM | Updated on Aug 11 2018 6:09 PM

నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే - Sakshi

నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే

తెలుగులో చిన్న సినిమాల నిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సెన్సార్‌ జరిగినా థియేటర్ల సమస్యలతో తమ సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు.

‘‘తెలుగులో చిన్న సినిమాల నిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సెన్సార్‌ జరిగినా థియేటర్ల సమస్యలతో తమ సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించకపోతే నిర్మాతలు, టెక్నిషియన్లతో కలసి నిరవధిక నిరహారదీక్ష చేస్తాం’’ అన్నారు తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌.

ఇంకా ఆయన మాట్లాడుతూ –‘‘తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. నలుగురు నిర్మాతల గుప్పెట్లో థియేటర్లు ఉన్నాయి. వాళ్లు డిజిటల్‌ వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకుని చిన్న నిర్మాతలను ముంచుతు న్నారు. థియేటర్ల లీజ్‌ సిస్టమ్‌ వల్ల చిన్న సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు’’ అన్నారు. ప్రభుత్వాలు ఈ సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని   టీఎఫ్‌సీసీ కార్యదర్శి సాయివెంకట్, తెలంగాణ ఆర్టిస్టుల సంఘం కార్యదర్శి జేవీఆర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement