బాలీవుడ్ తెరపై మాస్‌రాజా?
హిందీ సినిమాల ప్రభావం రవితేజపై చాలానే ఉంది. ముఖ్యంగా అమితాబ్ ఆయనకు రోల్‌మోడల్. సినిమాల్లోకి రాక ముందు తాను నార్త్‌లోనే ఎక్కువగా ఉండేవాణ్ణని
హిందీ సినిమాల ప్రభావం రవితేజపై చాలానే ఉంది. ముఖ్యంగా అమితాబ్ ఆయనకు రోల్‌మోడల్. సినిమాల్లోకి రాక ముందు తాను నార్త్‌లోనే ఎక్కువగా ఉండేవాణ్ణని, తన కాలేజ్ జీవితం ముంబైలోనే గడిచిందని గతంలో పలు మార్లు చెప్పారు కూడా ఆయన. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అనుకుంటున్నారా? త్వరలో ఈ మాస్‌రాజా... బాలీవుడ్ తెరపై తళుక్కున మెరవనున్నారు.
గతంలో పలుమార్లు రవితేజ బాలీవుడ్ అరంగేట్రంపై మీడియాలో చర్చలు జరిగాయి. కానీ అవన్నీ రూమర్లుగానే పరిగణింపబడ్డాయి. ఇప్పుడు మాత్రం రవితేజ తెరంగేట్రానికి నిజంగానే రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సమీర్ కర్ణిక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘కౌర్ అండ్ సింగ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇందులో రవితేజ కవలలుగా నటించబోతున్నారట.
బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే ద్విపాత్రాభినయం చేయడం ఆసక్తికరమైన విషయం. కడుపుబ్బ నవ్వించే కామెడీ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే కథానాయిక ఎవరో తెలియాల్సి ఉంది.