breaking news
Ravi Teja films
-
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్‌కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్ సాయంత్రం రిలీజ్ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్‌తో పాటే మూవీ రిలీజ్ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.ఓవరాల్‌గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచింది. వీకెండ్లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. -
బాలీవుడ్ తెరపై మాస్‌రాజా?
హిందీ సినిమాల ప్రభావం రవితేజపై చాలానే ఉంది. ముఖ్యంగా అమితాబ్ ఆయనకు రోల్‌మోడల్. సినిమాల్లోకి రాక ముందు తాను నార్త్‌లోనే ఎక్కువగా ఉండేవాణ్ణని, తన కాలేజ్ జీవితం ముంబైలోనే గడిచిందని గతంలో పలు మార్లు చెప్పారు కూడా ఆయన. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అనుకుంటున్నారా? త్వరలో ఈ మాస్‌రాజా... బాలీవుడ్ తెరపై తళుక్కున మెరవనున్నారు. గతంలో పలుమార్లు రవితేజ బాలీవుడ్ అరంగేట్రంపై మీడియాలో చర్చలు జరిగాయి. కానీ అవన్నీ రూమర్లుగానే పరిగణింపబడ్డాయి. ఇప్పుడు మాత్రం రవితేజ తెరంగేట్రానికి నిజంగానే రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సమీర్ కర్ణిక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘కౌర్ అండ్ సింగ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇందులో రవితేజ కవలలుగా నటించబోతున్నారట. బాలీవుడ్లో తొలి సినిమాతోనే ద్విపాత్రాభినయం చేయడం ఆసక్తికరమైన విషయం. కడుపుబ్బ నవ్వించే కామెడీ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే కథానాయిక ఎవరో తెలియాల్సి ఉంది.


