గుమ్మడికాయ కొట్టేశారు | Ravi Teja and Ileana's 'Amar Akbar Anthony' reveals little | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టేశారు

Published Tue, Sep 25 2018 4:01 AM | Last Updated on Tue, Sep 25 2018 4:01 AM

Ravi Teja and Ileana's 'Amar Akbar Anthony' reveals little - Sakshi

‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్‌’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై  నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ (సివిఎమ్‌) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. హీరో హీరోయిన్లపై హైదరాబాద్‌లో చిత్రీకరించిన చివరి పాటతో షూటింగ్‌ పూర్తయింది. సోమవారం శ్రీనువైట్ల పుట్టిన రోజు కానుకగా ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ పాత్రలను పరిచయం చేస్తూ, ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

‘‘సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ గెటప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. లయ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు, తరుణ్‌ అరోరా, అభిమన్యు సింగ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: పవ్రీణ్‌ మర్పూరి, సీఈఓ: చెర్రీ, కెమెరా: వెంకట్‌ సి దిలీప్, సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement