'రంగస్థలం 1985' ఆలస్యమవుతోందా..! | Rangashtalam 1985 Postpones to Summer | Sakshi
Sakshi News home page

'రంగస్థలం 1985' ఆలస్యమవుతోందా..!

Sep 7 2017 10:57 AM | Updated on Sep 17 2017 6:32 PM

'రంగస్థలం 1985' ఆలస్యమవుతోందా..!

'రంగస్థలం 1985' ఆలస్యమవుతోందా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే చిరంజీవి 151 సినిమా పనులతో చరణ్ బిజీగా ఉండటంతో రంగస్థలం షూటింగ్ పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి.

అందుకే షూటింగ్ మొదలై చాలా కాలం అయినా.. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందట. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమాను సంక్రాంతి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో చరణ్ సినిమా పోస్ట్ పోన్ లేదా ప్రీ పోన్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

గతంలో తన సినిమాలను ఇలాగే ప్రీ పోన్ చేసి ఇబ్బంది పడ్డ చెర్రీ ఈ సారి హడావిడి లేక కాస్త నెమ్మదిగా సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అందుకే సినిమాను వేసవి బరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఏకంగా మూడు నెలలు వాయిదా పడటంపై అభిమానులు నిరాశపడుతున్నారు. ప్రస్తుతానికి రంగస్థలం 1985 వాయిదాపై అధికారిక ప్రకటన లేకపోయినా.. పోస్ట్ పోన్ చేయటం కాయం అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement