కాలిఫోర్నియాలో క్యాజువల్‌గా... | ramcharan tej, varun tej meets in california | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో క్యాజువల్‌గా...

Mar 24 2019 1:44 AM | Updated on Mar 24 2019 1:44 AM

ramcharan tej, varun tej meets in california - Sakshi

రామ్‌చరణ్, వరుణ్‌ తేజ్‌

బ్రదర్స్‌ రామ్‌చరణ్, వరుణ్‌ తేజ్‌ ఇద్దరూ అనుకోకుండా కాలిఫోర్నియాలో కలుసుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించిన పని మీద కాలిఫోర్నియా వెళ్లినట్టున్నారు చరణ్‌. లేటెస్ట్‌ సినిమాలో బాక్సర్‌ పాత్ర కోసం కొంతకాలంగా అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్‌ తేజ్‌. అక్కడ అనుకోకుండా కలసిన ఈ బ్రదర్స్‌ సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నారు. ‘బ్రదర్స్‌ లవ్‌’ అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్‌ చేశారు వరుణ్‌.

వింటేజ్‌ కార్లు వాడుతున్నారట
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. కొమరమ్‌ భీమ్, సీతారామరాజు నిజజీవిత పాత్రల ఆధారంగా రూపొందుతున్న ఊహాజనిత కథ ఇది. పీరియాడికల్‌ మూవీ కావడంతో వింటేజ్‌ కార్ల అవసరం ఏర్పడింది. అందుకోసం బెంగళూర్‌ నుంచి పలు కార్లను అద్దెకు తీసుకున్నారట చిత్రబృందం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ నార్త్‌ ఇండియాలో జరుగుతోంది. అక్కడికి ఈ కార్లను తీసుకెళ్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న రిలీజ్‌ కానుంది.


ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement