‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ రిలీజ్‌పై వర్మ ప్రకటన

Ram Gopal Varma On Lakshmis NTR Release In Andhra Pradesh - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై హైకోర్టు స్టే విధించటంతో చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు.

అయితే రేపటితో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుండటంతో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్టే అని భావిస్తున్నారు చిత్రయూనిట్. వర్మ టీం రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు దర్శక నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ ప్రకటన చేశారు. ఈ వారం ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు వర్మ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top