ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది : వర్మ | Ram Gopal Varma Comment on Arjun Reddy Tamil Remake | Sakshi
Sakshi News home page

ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది : వర్మ

Nov 11 2017 11:18 AM | Updated on Nov 11 2017 1:06 PM

Ram Gopal Varma Comment on Arjun Reddy Tamil Remake - Sakshi

ట్విట్టర్‌కు గుడ్‌ బై చెప్పినా వర్మ మాటల దాడి మాత్రం ఆగటంలేదు. తాను వేదించాలనుకున్న వ్యక్తులు తనకు బోర్‌ కొట్టేశారంటూ ట్విట్టర్‌ ఎకౌంట్‌ క్లోజ్‌ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కొత్తగా ఫేస్‌బుక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా తన మాటల దాడి కొనసాగిస్తున్నాడు. ఇటీవల సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి సినిమాకు విపరీతమైన ప్రచారం చేసిన పెట్టిన వర్మ ఇప్పుడు ఆ సినిమా తమిళ రీమేక్‌​ మీద పడ్డాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వర్మ అనే టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. ఈ టైటిల్‌పై స్పందించిన వర్మ సినిమా టైటిల్‌ లోగో పోస్టర్‌తో పాటు ‘అర్జున్‌ రెడ్డి తమిళ వర్షన్‌ పేరు వర్మ అంట, ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం వర్మ నాగార్జున హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులతో పాటు వివాదాస్పద లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement