అలాగైతే ఏమీ చేయలేం : రకుల్‌ | Rakul Preet Singh Says She want to Experiment | Sakshi
Sakshi News home page

అలాగైతే ఏమీ చేయలేం! 

Oct 27 2019 8:58 AM | Updated on Oct 27 2019 8:58 AM

Rakul Preet Singh Says She want to Experiment - Sakshi

చెన్నై: అలాగైతే ఏమీ చేయలేం అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ అమ్మడు ఇటీవల తరచూ వార్తలో ఉండడానికి ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. కారణం కెరీర్‌ పరంగా సక్సెస్‌లకు దూరం అవడం కావచ్చు. మరిన్ని అవకాశాలు పొందే ప్రయత్నం కావచ్చు. ఎందుకంటే ఆ మధ్య టాలీవుడ్‌లోక్రేజీ హీరోయిన్‌గా వెలిగిన ఈ బ్యూటీకి అక్కడ అవకాశాలు తగ్గాయి. లక్కీగా కోలీవుడ్‌లో స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్‌తో ఇండియన్‌–2 చిత్రంలో రొమాన్స్‌ చేసే అవకాశం వరించడంతో వార్తల్లో కనిపిస్తోంది. ఇంతకు ముందు కోలీవుడ్‌లో కార్తీతో నటించిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్ర విజయం మినహా మరో సక్సెస్‌ లేదు. ప్రస్తుతం కమలహాసన్‌తో ఇండియన్‌–2 చిత్రంతో పాటు శివకార్తికేయన్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఇటీవల తరచూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. మీడియా ఇంటర్వ్యూలో రకరకాలుగా మాట్లాడుతుండడంతోనే వార్తల్లోఉంటోంది.

తాజాగా  ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రతిరోజూ మనకోసమే అన్న భావనతో జీవించాలని అంది. ఈ రోజు మన కోసం ఉంది. ఈ రోజు మనం జీవించి ఉన్నాం.ఈ రోజును మంచిగా గడపాలి అన్న భావనతో జీవించాలి అని పేర్కొంది. అలా గడిపితేనే జీవితంలో ఎలాంటిసమస్యలు తలెత్తవు అని అంది, తాను పంజాబి అమ్మాయిని అయినా, పెరిగిందంతా ఢిల్లీలోనేనని చెప్పింది, తన సినీ జీవితం కూడా దక్షిణాదిలోనే ప్రారంభమైందని చెప్పింది. ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిలా, చెన్నైకి వస్తే తమిళ అమ్మాయిగానూ, ముంబై వెళితే అక్కడి యువతిగా కనిపిస్తానని చెప్పింది. అంతేకానీ తానొక పంజాబీనన్న భావనే కలగదని అంది. ఇకపోతే సైనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని కావడంతో దేశం మొత్తం చుట్టి వచ్చానని తెలిపింది. తన చిన్న వయసులో కుటుంబసభ్యులు వేరే ఊరుకు వెళ్లితే అక్కడి పరిస్థితులకనుగుణంగా ప్రవర్తించేవారన్నారు.

అయితే తాను అలా కాదని, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతానని తెలిపింది. అందరితోనూ కలగలుపుగా ఉంటానని చెప్పింది. ఏ ప్రాంతానికి వెళ్లినా బిడియం పడకుండా కొత్త వారైనా వారితో మాట్లాడతానని అంది. అలా కాకుండా భయపడితే ఏమీ చేయలేమని అంది. ఏ భాషకు చెందినా తానొకభారతీయురాలినన్న భావన తనకు ఉందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. ఈ అమ్మడిపై రాశి లేని నటి ముద్ర వేశారట. దీని గురించి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ బాధపడుతూ తాను నటించిన చిత్రాల జయాపజయాలు తన చేతిలో ఉండవని అంది. సినిమా అన్నది సమష్టి కృషి, శ్రమ అనే పేర్కొంది. అలాంటిదితనపై రాశిలేని నటి అనే ముద్రవేయడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించింది, ఏదేమైనా ఇకపై వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించరాదని, కథ, ధర్శకుడు, కథానాయకుడు వంటి విషయాలను తెలుసుకుని నచ్చిన చిత్రాలనే చేయాలని నిర్ణయించినట్లు చెప్పింది. అదేవిధంగా చిత్రం చిత్రానికిగ్యాప్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పింది. అన్నట్టు తెలుగులో అవకాశాలు లేకపోయినా, తమిళంతో పాటు, హిందీలోనూ నటిస్తూ బిజీగానే ఉందీ అమ్మడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement