ప్రారంభమైన రకుల్‌ సోదరుడి సినిమా

Rakul Preet Singh Brother Aman Debut Film Launched - Sakshi

ప్రముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ క‌థానాయ‌కుడిగా దాస‌రి లారెన్స్ ద‌ర్శక‌త్వంలో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను షేక్ షా వ‌లి స‌మ‌ర్పణ‌లో ర‌జిని ఫిలిం కార్పొరేష‌న్ ప‌తాకంపై  మావురం ర‌జిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహూర్తపు స‌న్నివేశానికి ర‌కుల్ ప్రీత్ సింగ్ క్లాప్ కొట్టగా, హీరో సందీప్ కిష‌న్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు ల‌క్ష్మి గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ ప్రారంభోత్సవ వేడుక‌లో విల‌క్షణ న‌టుడు రావు ర‌మేష్ స‌హా చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయ స‌మావేశంలో... ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ‘నా సోద‌రుడు అమ‌న్ హీరోగా సినిమా ప్రారంభం కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. రెండేళ్ల క్రితం త‌న‌కు హీరో కావాల‌నుంద‌ని చెప్పగానే.. ప్యాష‌న్ ఉందా? ఉంటేనే ఇండ‌స్ట్రీలోకి రావాలని త‌న‌తో అన్నాను. త‌ను ప్యాష‌న్ ఉంద‌ని చెప్పాడు. ఎంతో ప‌ట్టుద‌ల‌గా తెలుగు నేర్చుకుని త‌న ప్యాష‌న్ ఏంటో చూపించాడు. నాకు హైద‌రాబాద్ హోం టౌన్ ఎలా అయ్యిందో.. అమ‌న్‌కు కూడా ఇప్పుడు హైద‌రాబాద్ హోం టౌన్‌లా మారింది. త‌ను మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడ‌ని భావిస్తున్నాను’ అన్నారు. 

ద‌ర్శకుడు దాస‌రి లారెన్స్ మాట్లాడుతూ ‘ల‌వ్‌, యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో రూపొందే సినిమాలో అమ‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌న పాత్ర ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. మంచి కామెడీ క‌థ‌లో భాగంగా ఉంటుంది. మార్చి మొద‌టి వారంలో తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది’ అన్నారు. హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ ‘అమ‌న్ నాకు త‌మ్ముడితో స‌మానం. త‌ను పెద్ద హీరోగా ఎద‌గాల‌ని కోరుకునే వాళ్లలో నేను ముందుంటాను. త‌ను హీరోగా ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ని ఏడాదిన్నర క్రితం తెలిసింది. త‌ను అందుకు త‌గ్గట్టు క‌ష్టప‌డ్డాడు. తెలుగు భాష నేర్చుకుని సినిమా చేయ‌బోతుండ‌టం గొప్ప విష‌యం’ అన్నారు. 

హీరో అమ‌న్ మాట్లాడుతూ ‘సంతోషంతో మాట‌లు రావ‌డం లేదు. చాలా నెర్వస్‌గా, టెన్షన్‌గా ఉంది. తెలుగులో హీరోగా ఎంట్రీ అవుతుండ‌టం చాలా సంతోషంగా ఉంది. మంచి క‌థ‌, స్క్రీన్‌ప్లేతో ద‌ర్శకుడు దాస‌రి లారెన్స్‌గారు చెప్పిన విధానం న‌చ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంది. అలాగే నిర్మాత ర‌జినిగారికి థాంక్స్‌’ అన్నారు. హీరోయిన్ మోనికా శ‌ర్మ మాట్లాడుతూ ‘చాలా మంచి పాత్ర చేస్తున్నాను. నా నిజ జీవితానికి ద‌గ్గర‌గా ఉండే హ్యపీ అండ్ ల‌క్కీ అమ్మాయి పాత్రలో మెప్పిస్తాను. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు థాంక్స్‌’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top