దేవుడికి చెప్పాకే చేస్తా: రాఘవ లారెన్స్
'నేను ఏమిచేసినా ముందు దేవుడికి చెప్పాకే చేస్తాను' అంటున్నాడు లారెన్స్
తిరుమల: 'నేను ఏమిచేసినా ముందు దేవుడికి చెప్పాకే చేస్తాను' అని సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ అన్నారు. సోమవారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పి.వాసు దర్శకత్వంలో తాను నటించిన శివలింగ చిత్రం జనవరి 26న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
తన తమ్ముడు ఎల్విన్‌ను పరిచయం చేస్తూ జనవరి 14 తర్వాత కొత్త చిత్రం తీయబోతున్నానని చెప్పారు. అందుకే శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు ఇంటిల్లిపాది తిరుమల వచ్చామన్నారు. చిరంజీవి 150వ చిత్రంలోని ప్రారంభ పాటకు తానే కోరియోగ్రఫీ చేశానని, పాట బాగా వచ్చిందన్నారు లారెన్స్.


