విశాల్‌పై రాధిక ఫైర్‌

Radhika Sarathkumar Fire on Hero Vishal - Sakshi

నడిగర్ ఎన్నికలు ఈ సారి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి గెలిచి సత్తా చాటాలని విశాల్ సారధ్యంలోని పాండవర్‌ టీం ప్రయత్నిస్తుంది. అయితే ఈ సారి విశాల్‌ టీంకు వ్యతిరేకంగా భాగ్యరాజ్‌ బరిలో దిగటంతో పోటి ఆసక్తికరంగా మారంది. ప్రచారంలో భాగంగా విశాల్ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది.

గత కమిటీలపై దుమ్మెత్తిపోస్తూ గత ఎన్నికలలో కొందరు శరత్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను ట్వీట్లుగా యూట్యూబ్ ద్వారా మళ్లీ తెరపైకి తెచ్చాడు విశాల్. అయితే ఈ వీడియోలపై శరత్ కుమార్ భార్య సీనియర్ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మిలు తీవ్రస్థాయిలో చిరుచుకు పడుచున్నారు.

ఇప్పటికే విశాల్‌కు ట్విటర్‌ ద్వారా బహిరంగ లేఖ రాసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నా ఓటును కోల్పోయావ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. గతంలో ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ బయటపెట్టడం ఆయన దిగజారుడుతనా‌నికి నిదర్శనమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై సీనియర్‌ నటి, శరత్‌కుమార్ సతీమణి రాధిక స్పందించారు.

నిజంగా శరత్ కుమార్ తప్పు చేసుంటే న్యాయస్థానం తేల్చుతుందని, న్యాయస్థానంలో ఉన్న కేసుపై విశాల్ వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అని ఆమె మండిపడ్డారు. అంతేకాదు.. నిజంగానే విశాల్ టీమ్ ఈ రెండేళ్ళలో అభివృద్ది చేసుంటే వాటిని చూపించి ఓట్లు అడగాలి, కాని పాత విషయాలు, న్యాయస్థానంలో ఉన్న విషయాల‌ను విశాల్ మాట్లాడుతున్నారంటే ఆయనకు నడిగర్ సంఘానికి చేసింది ఏమిలేదని అర్థం అవుతుందన్నారు. ఇదే ఇప్పుడు విశాల్ కు ఇబ్బందులు తెచ్చిపడుతుంది. 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ రాధిక, వరలక్ష్మిలతోపాటు మరికొందరు సీనియర్ల విమర్శలు దక్షిణాది సినిమా నటీనటుల సంఘంలో చర్చనీయాంశంగా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top