యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది | Puri Jagannadh lauds Action Trailer | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది

Nov 2 2019 6:03 AM | Updated on Nov 2 2019 6:03 AM

Puri Jagannadh lauds Action Trailer - Sakshi

పూరి జగన్నాథ్, శ్రీనివాస్‌ ఆడెపు

‘‘యాక్షన్‌’ సినిమా ట్రైలర్‌ చూశా.. చాలా చాలా బాగుంది. విశాల్, తమన్నా తమ నటనతో, సుందర్‌ సి. తన డైరెక్షన్‌తో చింపేశారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు  దర్శకుడు పూరి జగన్నాథ్‌. విశాల్, తమన్నా జంటగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యాక్షన్‌’. ‘ఇస్మార్ట్‌ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3’ వంటి హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు ‘యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’ డిస్ట్రిబ్యూటర్‌ శ్రీను ‘యాక్షన్‌’ సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావాలి.. మంచి డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ విశాల్‌ అద్భుతంగా చేశారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయనున్నా’’ అన్నారు శ్రీనివాస్‌ ఆడెపు.

Advertisement
 
Advertisement
Advertisement