తీన్‌మార్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతుందా.. | Pulkit Samrat Kriti Kharbanda Attracts Netizens With Their Dresses | Sakshi
Sakshi News home page

తీన్‌మార్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతుందా..

Dec 18 2019 5:15 PM | Updated on Dec 18 2019 7:47 PM

Pulkit Samrat Kriti Kharbanda Attracts Netizens With Their Dresses - Sakshi

ముంబై: పులకిత్‌ సామ్రాట్‌, కృతి కర్బందా ప్రేమ జంట బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. పులకిత్‌ సామ్రాట్‌తో కృతి ప్రేమలో ఉందంటూ మీడియాలో పలు మార్లు వీరి ప్రేమ వార్త చక్కర్లు కొట్టింది. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ జంట తమ ప్రేమను అంగీకరించింది. పులకిత్‌ సామ్రాట్‌, కృతి కర్బందా జంటగా పాగల్‌పంతీ సినిమాలో నటించారు. పులకిత్‌ పూల కుర్తా తెలుపు పైజామాతో.. కృతి పింక్ లెహంగాతో సాంప్రదాయకబద్దంగా దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ పలువురు నెటిజన్లు అభినందించారు.

పులకిత్‌‌, కృతి జంటకు ముగ్దులైన నెటిజన్లు పెళ్లి చేసుకుంటున్నారా లేక స్నేహితుడి వివాహానికి హాజరవుతున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాగల్‌ పంతీ సినిమా డైరెక్టర్‌ అన్నీస్‌ అజ్మీ మాట్లాడుతూ.. పులకిత్‌, కృతి ప్రేమించుకోవడం తనకు కలిసొచ్చిందన్నారు. వీరు ప్రేమికులు కనుక నటించాల్సిన అవసరం రాలేదని.. జీవించారని దర్శకుడు తెలిపాడు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన కృతి... బోణీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అక్కినేని మనుమడు సుమంత్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కృతికి సక్సెస్‌ ఇవ్వకపోయినా... కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక పవన్‌ కల్యాణ్‌తో కలిసి తీన్‌మార్‌ మూవీలో నటించిన కృతికి.. ఆ సినిమా కూడా నిరాశపరచడంతో పూర్తిగా సాండల్‌వుడ్‌కే పరిమతమైపోయింది. పాగల్‌పంతీ సినిమా ప్రమోషన్లో భాగంగా గత నెలలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని కన్‌ఫాం చేసింది. మేమిద్దరం జంటగా బాగుంటాం గనుక మా గురించి ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. మీరు అనుకుంటున్నట్లుగా అవి రూమర్లు కాదు. నిజమే నేను సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నాను. ఒక వ్యక్తి నచ్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు లేదా పదేళ్లు పట్టొచ్చు. కానీ పులకిత్‌ ఐదు నెలల్లోనే నాకు పూర్తిగా అర్థమయ్యాడు. తనతో మాట్లాడటం నాకెంతో సౌకర్యవంతంగా ఉంటుందని కృతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement