సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూత | prominent music director died | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూత

Jul 14 2015 7:38 AM | Updated on Sep 28 2018 3:41 PM

సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూత - Sakshi

సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూశారు. కేరళలో ఆయన 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోగల ఇలప్పుళిలో జన్మించారు

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూశారు. కేరళలో ఆయన 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోగల ఇలప్పుళిలో జన్మించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

సీఎస్ సుబ్బరాజన్తో కలిసి దేవదాసు, లైలా మజ్నూవంటి చిత్రాలకు సంగీతం అందించిన విశ్వనాథన్.. సిపాయి చిన్నయ్య, ఇంటికి దీపం ఇల్లాలే, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, సినిమాలకు సంగీతం అందించారు. మొత్తం 1200 చిత్రాలకు పైగా ఆయన సంగీతం అందించారు. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలకు విశ్వనాథన్ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement