MS Viswanathan
-
సంగీత శిఖరం MS విశ్వనాథన్ మరణం
-
ఏమో! గుర్రం దిగీ రావచ్చు!
సొగసైన సాకీలు రచించవచ్చు. అందమైన పల్లవులు రాసుకోవచ్చు. అద్భుతమైన చరణాలు లిఖించవచ్చు. మరి ఇవన్నీ సవారీ చేయాలంటే... గుర్రం కావాలి కదా! గజ్జెల గుర్రం కావాలి కదా! మనయంగత్ సుబ్రహ్మణియన్ విశ్వనాథన్ మెదడులో శతకోటి సరిగమల గుర్రాలు. వాటిలో మనం కొన్నే విన్నాం. మిగతా గుర్రాలు ఆయనతోనే ఎగిరిపోయాయి. సాకీలు, పల్లవులు, చరణాలు తపస్సు చేస్తే... ఏమో గుర్రం దిగీ రావచ్చు. 24 జూన్ 1928 - 14 జూలై 2015 ►ఎమ్మెస్ విశ్వనాథన్ అంటే గ్రేట్ మ్యూజిక్ డెరైక్టర్. గ్రేట్ మేన్. ►సౌత్ ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీకే గ్రేట్ ఇన్స్పిరేషన్. ►సముద్రంలా విస్తరించిన ఎమ్మెస్వీ ప్రయాణం ఓ కన్నీటి చుక్కతో మొదలైంది. ►ఆకాశంలా ఎదిగిన ఎమ్మెస్వీ ప్రస్థానం అమావాస్యతో ప్రారంభమైంది. ►అవును... ►ఎమ్మెస్వీ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ►చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నవాడు - ►సంగీత పాఠశాల పిట్టగోడ మీద కూర్చుని సంగీతం నేర్చుకున్నవాడు - ►సినిమా హీరో కావాలని కలలు కని జూనియర్ ఆర్టిస్టు వేషానికి కూడా కొరగానివాడు - ►కేవలం 5 రూపాయల జీతానికి జూపిటర్ పిక్చర్స్ సినిమా ఆఫీసులో బాయ్‌గా పని చేసినవాడు - ►డ్రామా కంపెనీలో హార్మోనిస్టుగా ప్రతిభ చూపినవాడు - ►సినీ సంగీత ప్రపంచంలో ఓ మేరుశిఖరంలా ఎదిగాడు. ►ఆయన వెనుక ఎవ్వరూ లేరు. సరిగమ పదనిసలు... స్వయంకృషి... శ్రమ... పాండిత్యం... వ్యక్తిత్వం... పనిని ప్రేమించేగుణం... ఇవన్నీ ఎమ్మెస్వీని ఇంతెత్తున నిలబెట్టాయి. ► అసలు ఎమ్మెస్వీ ప్రాభవం గురించి చెప్పాలంటే - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పాలి. ఇళయరాజా చెప్పాలి. మద్రాసు మైలాపూర్ రోడ్లో ఎమ్ఎస్వి 5052 బ్లాక్ అంబాసిడర్ కారులో ఎమ్మెస్వీ దర్జాగా వెళ్తుంటే ఎస్పీబీ, ఇళయరాజా పారవశ్యంతో దర్శించుకుని ఇన్స్పైరయ్యేవారు. ఆయనదో శకం. రామమూర్తితో కలిసి ‘విశ్వనాథన్ - రామమూర్తి’గా చేసిన సినిమాలు కొన్నయితే, సోలోగా పనిచేసినవి వందలు. స్టార్లు... సూపర్స్టార్లు... టాప్ డెరైక్టర్లు... పాపులర్ బేనర్లు... కొత్తా పాతా... చిన్నా పెద్దా... ఎవ్వరికైనా ఎమ్మెస్వీ మ్యూజిక్కే పెద్ద అండాదండా. ట్రెండ్లు సైతం ఎమ్మెస్వీ ముందు తలవంచాల్సిందే. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేవాడాయన. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా. ఎమ్మెస్వీ చేసినన్ని ప్రయోగాలూ ఇంకే సంగీత దర్శకుడూ చేయలేదు. ఆ జమానాలో మిగతా సంగీత దర్శకులు కూడా డెరైక్ట్గానో, ఇన్డెరైక్ట్గానో ఆయన్ను అనుసరించనవాళ్లే... అనుకరించినవాళ్లే. ఎమ్మెస్వీ హుషారైన మనిషి. జోకులేసే మనిషి. పని దగ్గర మాత్రం ఉగ్రనరసింహుడు. సంగతుల్లో గతి తప్పితే గాయనీ గాయకుల పని అంతేసంగతులు. మణిరత్నం ‘కణ్ణతిన్ ముత్త మిట్టాల్’ లాంటి సినిమాల్లో పాటలు పాడారు. అనేక తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. ‘గంగా యమున సరస్వతి’ అనే టీవీ సీరియల్లో ఆయన నటించిన విషయం తమిళ, తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఇంకా గుర్తే. ఇవాళ్టి సంగీతం ఫాస్ట్ఫుడ్లా మారిపోయిందని వాపోతుండేవారు. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయనకు ‘పద్మ’ పురస్కారం ఒక్కటీ రాకపోవడం మన ప్రభు త్వాల అజ్ఞానానికి నిదర్శనం. అవేవీ రాకున్నా ప్రజలిచ్చిన‘మెల్లిసైమన్నర్’ (లలిత సంగీత చక్రవర్తి)గా బిరుదు చాలదూ! సంగీతంలో ఆయన ఘనాపాఠి - కె. విశ్వనాథ్ (ప్రముఖ సినీ దర్శకుడు) సినీ రంగంలో ఆడియోగ్రాఫర్‌గా 1940ల చివరలోనే కెరీర్ మొదలుపెట్టడం వల్ల విశ్వనాథన్ - రామమూర్తి జంట గురించి వారి తొలి అడుగుల నుంచి తెలుసు. ఎమ్మెస్వీ సంగీతంలో నేనో తమిళ సినిమా చేయాల్సింది. ‘జెమిని’ వాసన్ గారి అల్లుడు జి.ఎస్. మణి నా దర్శకత్వంలో తమిళ సినిమా చేయాలనుకున్నారు. ప్రసిద్ధ రచయిత కణ్ణదాసన్ సాహిత్యం. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు కానీ, ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికీ తీపి గుర్తే! ఆ సినిమా కోసం 4 పాటల దాకా కంపోజింగ్ చేశాం. కె.వి. మహదేవన్‌లో, ఎమ్మెస్వీలో ఓ గొప్ప లక్షణం ఉంది. వాళ్ళు ఏ బాషలో సినిమా చేస్తారో, ఆ భాష నేటివిటీని అర్థం చేసుకొని, వాళ్ళు ఆ భాషవారేనేమో అనిపించేలా సంగీతం చేస్తారు. ఎమ్మెస్వీ హై-ఓల్టేజ్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయన తాదాత్మ్యంగా కంపోజ్ చేస్తుంటే, శరీరం మొత్తం ఊగుతూ, అణువణువూ సంగీతమయంగా అనిపించేది. తమిళంలో ఎమ్జీయార్, శివాజీ స్టార్స్ అయ్యారంటే, ఎమ్మెస్వీ పాటల పాత్ర చాలా ఉంది. ఒక్కముక్కలో - వేదంలో ఘనాపాఠీలు ఉన్నట్లే, సంగీతంలో ఆయన ఘనాపాఠి. స్వరమాధురి ఆయన విలక్షణత - డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినీ గీతరచయిత) ఎమ్మెస్వీ మంచి పరిజ్ఞానమున్న సంగీత నిర్దేశకుడు. మాతృభాష మలయాళమైనా, తమిళనాట ప్రథమశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. అప్పట్లో జెమినీ వారు ‘ఆడబ్రతుకు’ (1965) అనే సినిమా తీశారు. దానికి విశ్వనాథన్- రామమూర్తి సంగీతం. అందులో అధికభాగం పాటలు నావే. ‘పిలిచే నా మదిలో’ పాట సుప్రసిద్ధం. ‘ఆహా అందము చిందే’ అందులోదే. ‘ప్రేమలు పెళ్ళిళ్ళు’ (’74)లో ‘ఎవరువీవు, నీ రూపమేది...’, ‘మొరటోడు’ (’77)లో ‘హే కృష్ణా! మళ్ళీ నీవే జన్మిస్తే...’ లాంటి హిట్ పాటలెన్నో ఎమ్మెస్వీ బాణీలే. మహదేవన్, ఎమ్మెస్వీ - ఒక సమయంలో చిత్రసీమను ఏలారు. ఎవరి పంథా వారిదే. ‘మామ’ మహదేవన్ మనం పాట రాసిస్తే, దానికి ట్యూన్ కట్టేవాడు. ఎమ్మెస్వీ తాను ముందు ట్యూన్ ఇచ్చేవాడు. మనం రాసిన పాటకూ ట్యూన్ కట్టేవాడు. ఎమ్మెస్వీలోని విలక్షణత - స్వరమాధురి (మెలొడీ)కి ఆయన ఇచ్చే ప్రాధాన్యం. అదే సమయంలో పాట లయాత్మకంగా ఉండాలనేవాడు. ఆయన బాగా పాడేవాడు. పాడుతూ, వినిపించేవాడు. గాయకులకు నేర్పేవాడు. ఆ కొందరిలో... ఒకడు! - దాసరి నారాయణరావు (ప్రముఖ దర్శకుడు) భారతదేశంలో సంగీతంలో విద్వత్తున్న గొప్ప సంగీత దర్శకులు కొందరిలో ఎమ్మెస్ విశ్వనాథన్ ఒకరు. నా దర్శకత్వంలో వచ్చిన ‘ఓ ఆడది - ఓ మగాడు’కి ఆయన సంగీతం కూర్చారు. నేటి ప్రముఖ గాయకుడు మనో (నాగూర్‌బాబు) ఆ సినిమాలో తమ్ముడిగా ఒక ప్రధానపాత్ర చేశాడు. మనోను ఎమ్మెస్వీకి పరిచయం చేశా. మనో గొంతు విని, ఆయన కుటుంబానికున్న సంగీతానుభవాన్ని చూసి ఆయన సంతోషించారు. కొన్నాళ్ళ తరువాత తన దగ్గర మనోకు అవకాశమిచ్చారు. తమిళంలో కె. బాలచందర్ అద్భుత చిత్రం - ‘అపూర్వ రాగంగళ్’. ఆ సినిమాకు సంగీతం ఎమ్మెస్వీనే! ఆ చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు - పడమర’గా నేను రీమేక్ చేసినప్పుడు, నాకు ఎప్పుడూ కాంబినేషనైన రమేశ్‌నాయుడు వైపు మొగ్గా. రమేశ్‌నాయుడు అన్నీ కొత్త బాణీలే కట్టారు. తమిళ ఒరిజినల్లోని సిట్యుయేషన్కూ, బాణీకీ భిన్నమైన సినారె రచన ‘శివరంజనీ నవరాగిణీ...’ పాట. ‘తూర్పు - పడమర’ పూర్తయ్యాక ఆ సినిమా ఎమ్మెస్వీకి చూపించా. ఆయన సినిమా, ఆ పాటలు చూసి, రమేశ్నాయుడునూ, పాడిన ఎస్పీబీనీ ఎంత అభినందించారో! సంగీత జ్ఞానం, అభిరుచున్న జీనియస్ - రావు బాలసరస్వతి (తొలితరం సినీ గాయని) 1940ల ద్వితీయార్ధంలో సుబ్బురామన్ దగ్గర తమిళ, తెలుగుల్లో చాలా పాటలు పాడా. ఆయన దగ్గర ఎమ్మెస్వీ పియానో వాయించేవాడు. అలా చిన్న కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెస్వీ నాకు తెలుసు. చిన్న వయసులోనే అతనెంత జీనియస్సో! సుబ్బురామన్ చనిపోయాక, ‘దేవదాసు’కు మిగతా ట్యూన్స్ కట్టింది ఎమ్మెస్వీనే. అందులో క్షేత్రయ్య పదం నాతో పాడించాడు. మ్యూజిక్ డెరైక్టరయ్యాక తన తొలిచిత్రం ‘మా గోపి’లో ‘ఓ ముద్దుపాపా...’ అనే లాలిపాట పాడించాడు. మనిషి పొట్టి అనే మాటే కానీ, అపారమైన తెలివి... అద్భుత సంగీత జ్ఞానం ఎమ్మెస్వీ సొంతం. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్. కర్ణాటక సంగీతం బాగా వచ్చు కాబట్టి, సులభంగా ట్యూన్ చేసేవాడు. ఏ ఆర్టిస్టు ఏ పాట పాడితే బాగుం టుందో గుర్తించి, వాళ్ళతో అలాంటి పాటలు పాడించేవాడు. మద్రాస్ సఫైర్ థియే టర్లో ఉదయం ఆటలతో 596 రోజులాడిన ‘మరోచరిత్ర’లో 5 పాటలూ అయిదుగురు వేర్వేరు ఫిమేల్ సింగర్స్‌తో పాడించడం ఉదాహరణ. ఎన్నో హిట్లిచ్చినా, గర్వం ఉండేది కాదు. అలాంటి మ్యూజిక్ డెరైక్టర్లు అరుదు. ప్రతి పాటా... ఒక రత్నమే - ఎస్. జానకి (ప్రముఖ సినీ గాయని) తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎమ్మెస్వీ దగ్గర ఎన్నో హిట్ పాటలు పాడా. ఒక్కో పాట ఒక్కో రత్నం. తెలుగు సరే సరి. మలయాళంలో ఆయన మ్యూజిక్‌తో నాకెంతో పేరొచ్చింది. అక్కడ పాడిన ‘ఆనిమిషత్తిండే...’, ‘వీణపూవే...’, ‘నిశీథినే...’ లాంటి పాటలను ఇవాళ్టికీ అక్కడి సినీ ప్రియులు చెప్పుకుంటారు. విచిత్రం ఏమిటంటే, మెలొడీలో ఎమ్మెస్వీ నాకు గురువు లాంటి వాడని చెప్పే ఇళయరాజా ఆ తరువాత ఎమ్మెస్వీతో కలసి ‘మెల్ల తిరందద్ కదవు’ అనే తమిళ చిత్రానికి పనిచేశారు. అందులో పాటలకు ట్యూన్స్ ఎమ్మెస్వీ కట్టారు. పాటల మధ్యలోని బీజియమ్లు ఇళయరాజా చేశారు. అందులో ‘వా వెన్నిలా...’ పాట ఇవాళ్టికీ హిట్టే. ఎమ్మెస్వీ స్వయంగా గాయకుడు. అడపాదడపా తమిళంలో పాడేవారు. ఆయనతో కలసి నేను డ్యూయెట్లు పాడా. ఆ రోజుల్లో తమిళంలో సింగర్స్ పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, సౌందరరాజన్లకు ఎమ్మెస్వీ పెద్ద హిట్స్ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వగీతమైన తమిళ్‌తాయ్ వాళ్తు ‘నీరారుమ్ కడలుడుత్త...’కు ట్యూన్ కట్టి, సుశీల, సౌందరరాజన్‌లతో పాడించిందీ ఎమ్మెస్వీనే. అవి ఆయన నాకిచ్చిన పెద్ద గిఫ్ట్‌లు - ఎల్.ఆర్. ఈశ్వరి (ప్రముఖ సినీ గాయని) కాలంతో చెరిగిపోని ఎన్నో పాటలు ఎమ్మెస్వీ చేశారు. తమిళంలో కణ్ణదాసన్, వాలి లాంటి మహా రచయితలు ఎమ్మెస్వీ బాణీకి కూర్చిన పాటల్లో మంచి విషయాలెన్నో చెప్పారు. ఇవాళ్టికీ వాటిని జనం పాడుకుంటూ తలుచు కొంటున్నారు. సంగీత దర్శకుడిగా ఆయ నెంతో శ్రమించి, సాధన చేసి పైకొచ్చారు. ఆయనలోని గొప్ప సంగతి - ఆయన పాటకు ఆయనే తొలి ఫ్యాన్. తనకూ, చుట్టూ ఉన్నవాళ్ళకీ నచ్చితేనే దర్శకుడికి ఆ ట్యూనిచ్చేవారు. ఎమ్మెస్వీ అంటే నాకు ఆరాధన. ఆయనంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు ఇష్టం. చిన్నప్పటి నుంచీ నాకు ఆయనొక్కరే. నా 25వ ఏట నుంచి ఇప్పటి దాకా ఆయనతోనే జీవితం పంచుకున్నా. అంత పెద్ద మ్యూజిక్ డెరైక్టరైనా, ఆయనది వట్టి పసిపిల్లాడి మనస్తత్వం. ‘బలే బలే మగాడివోయ్’ (మరోచరిత్ర), ‘సన్నజాజులోయ్ కన్నెమోజు లోయ్’ (సింహబలుడు) లాంటివి ఆయన నాకిచ్చిన పెద్ద గిఫ్ట్‌లు. నెలరోజులుగా ఆస్పత్రిలో ఉంటే, చూడలేకపోయాను. ఇవాళ ఒక శకం ముగిసింది. కన్నీళ్ళు పెట్టకుండా ఆయన పాటలతోనే ఆయన అంతిమయాత్ర సాగాలి. సినీ సంగీత హిమాలయం - ఈరంకి శర్మ (దర్శకుడు) బాలచందర్ గారి దగ్గర పనిచేసే రోజుల నుంచి నాకు ఎమ్మెస్వీ క్లోజ్. నేను డెరైక్ట్ చేసిన 5 తెలుగు, 3 కన్నడ చిత్రాల కూ ఆయనదే మ్యూజిక్. యద్దనపూడి నవలతో, నా డెరైక్షన్‌లో కె.ఎస్. రామారావు నిర్మించిన ‘పార్థు’ సీరియల్‌కి పాటలు, రీరికార్డింగ్ ఎమ్మెస్వీనే చేశారు. ఎన్నో వందల చిత్రాలు ఆయన చేసినా, బెస్ట్ మ్యూజిక్ డెరై క్టర్‌గా ఆయనకు బంగారు నంది వచ్చిన ఏకైక సినిమా నా డెరైక్షన్‌లోని ‘నాలాగా ఎందరో’ (1978). కల్యాణి రాగంలోని ‘కల్యాణినీ’ పాట ఇవాళ్టికీ గుర్తే. సిట్యుయే షన్ చెప్పగానే ఇన్స్పైరై ట్యూన్ చేసేవారు. రీరికార్డింగ్ మాస్టర్. ఎస్పీబీని తమిళ్లో పరిచయం చేసిందీ ఎమ్మె స్వీనే. తర్వాతి తరానికి మెలోడీ అనే కిటుకు నేర్పి, 90 శాతం హిట్లిచ్చిన సంగీత హిమాలయం నేడు ఒరిగింది. ఆ సంగీతం... విమల గాంధర్వం - వి.ఏ.కె. రంగారావు (సంగీత విమర్శకుడు) విశ్వనాథన్ - రామమూర్తి కలసి సంగీతం చేసినప్పుడు ఎవరు, ఏది, ఎంత చేశారో వారికే తెలుసు. నా దృష్టిలో అది తెలుగు సినిమాలో వినిపించిన విమల గాంధర్వం. సుబ్బురామన్ పోయేవేళకు అయిదారు చిత్రాల సంగీతం మిగిలింది. అవన్నీ (ప్రజారాజ్యం, దేవదాసు, వగైరా) విశ్వనాథనే పూర్తి చేశాడు. ‘దేవదాసు’లో జగమే మాయ, క్షేత్రయ్య పదం ఇంత తెలిసియుండి.. సంగీతం ఇతనివే. అంతకు ముందూ, వెనుకా ఎవరూ క్షేత్రయ్యపదాన్ని ఇతనిలా రాగమాలికగా చేయలేదు. భానుమతి ‘చండీరాణి’కి సంగీతమూ విశ్వనాథన్‌దే. సిద్ధ గాయకులతోనే కాక, అరుదుగా పాడేవాళ్ళతో ఆ కంఠంలో ఏది అందంగా పలుకుతుందో దాన్ని పలికించిన నేర్పు విశ్వనాథన్ది. మరపురాని మధుర సంగీత చక్రవర్తి ఎమ్మెస్వీ తెలుగులో చాలా మంచి పాటలు స్వరపరిచారు. అన్నీ భావగర్భితాలు... రాగగర్భితాలు. ముఖ్యంగా కె. బాలచందర్ కాంబినేషన్లో ఎమ్మెస్వీ చేసిన పాటలన్నీ నేల నలుచెరగులా మార్మోగిపోయాయి. ఎమ్మెస్వీ పేరు చెప్పగానే బాగా గుర్తొచ్చే... తరచుగా పాడుకునే అనేకానేక పాటల నుంచి... ఓ ఇరవై తెలుగు పాటలతో ఆయనకు స్వరాంజలి... ► పోతే పోనీ పోరా... చిత్రం: ప్రాయశ్చిత్తం(1962) ►రేపంటి రూపం కంటి... మంచి- చెడు (1963) ► ఆహా అందము చిందే హృదయ కమలం... ఆడబ్రతుకు (1965) ► తలచినదే జరిగినదా... దైవం ఎందులకు?... మనసే మందిరం (1966) ► పిల్లలూ దేవుడూ చల్లనివారే... లేత మనసులు (1966) ► నన్ను ఎవరో తాకిరి... సత్తెకాలపు సత్తయ్య (1969) ►నా జన్మభూమి ఎంత అందమైన దేశము... సిపాయి చిన్నయ్య (1969) ►ఏమంటున్నది ఈ గాలి? మేమూ మనుషులమే (1973) ► హల్లో మైడియర్ రాంగ్ నెంబర్... మన్మథలీల (1976) ► దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... అంతులేని కథ (1976) ► ఏ తీగ పువ్వునో... మరోచరిత్ర (1978) ► సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్... సింహబలుడు (1978) ► అటు ఇటు కాని హృదయం తోటి... ఇది కథ కాదు (1979) ► మౌనమె నీ భాష ఓ మూగమనసా?... గుప్పెడు మనసు (1979) ►కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు... అందమైన అనుభవం (1979) ►రెక్కలు తొడిగి రెపరెపలాడి... చుట్టాలున్నారు జాగ్రత్త (1980) ► సాపాటు ఎటూ లేదు... ఆకలి రాజ్యం (1981) ► అందమైన లోకమని రంగురంగులుంటాయని... తొలి కోడి కూసింది (1981) ►పల్లవించవా నా గొంతులో... కోకిలమ్మ (1983) ►ఎవ్వరిది ఈ పిలుపు?... మానసవీణ (1984) -
ఎంఎస్ విశ్వనాథన్ అస్తమయం
అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస 1,200 చిత్రాలతో సుదీర్ఘ ప్రస్థానం చెన్నై, సాక్షి ప్రతినిధి: దక్షిణ భారత సినీసంగీత గురుకుల గురువు.. ద్రవిడభాషా చలనచిత్ర స్వర సామ్రాజ్యాన్ని నాలుగు దశాబ్దాల పాటు ఏలిన సంగీత దర్శక చక్రవర్తి ఎంఎస్ విశ్వనాథన్(87) అస్తమించారు. హార్మొనీ కాలం నుంచి అత్యాధునిక ఆర్కెస్ట్రా దాకా అన్ని పరికరాలతో 1,200కు పైగా చిత్రాలలో అలవోకగా స్వరాలను పలికించిన ఎంఎస్ హృద్రోగ సమస్యతో మంగళవారమిక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తెల్లవారుజామున 4.15 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన సతీమణి జానకి 2012లో మరణించారు. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎంఎస్ మరణవార్త వినగానే తమిళ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తండోపతండాలుగా ఇంటికి తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుమారుడు గోపి తెలిపారు. తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత ఎంఎస్ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. వెండితెరపై చెరగని ముద్ర.. తమిళనాడులో ఒక సంగీత దర్శకుడిని అమితంగా ఆరాధించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత తొలుతగా ఎమ్ఎస్ విశ్వనాథన్కే దక్కింది. 1951 నుండి 1981 వరకు తన సినీ సంగీత ప్రవాహంలో తమిళులను ఓలలాడించిన ఆయన, 1928 జూన్ 24న కేరళలోని పాల్ఘాట్ సమీపంలోని ఎలపుల్లిలో జన్మించారు. 13 ఏళ్లకే వేదికపై కచ్చేరీలు నిర్వహించారు. టీకే రామమూర్తితో కలిసి విశ్వనాథన్-రామమూర్తి పేరుతో 700 చిత్రాలకు సంగీతం అందించారు. ఎంజీ రామచంద్రన్ నటించిన జెనోవా చిత్రం ఎంఎస్ వేరుగా సంగీతం అందించిన తొలిచిత్రం. తమిళంతోపాటూ తెలుగు, కన్నడ, హిందీ కలుపుకుని మరో 500 చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగువారికీ అభిమాన పాత్రుడు ఎంఎస్ సంగీతఝరి తెలుగువారినీ అలరించింది. అక్కినేని నటించిన దేవదాసు చిత్రంలోని జగమేమాయ పాటకు స్వరకల్పన చేసింది ఆయనే.‘మరోచరిత్ర’, ‘అంతులేని కథ’ వంటి అనేక చిత్రాలు ఆయన స్వరప్రవాహం నుండి జాలువారినవే. చంద్రబాబు, జగన్ సంతాపం.. ఎంఎస్ విశ్వనాథన్ మృతికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. వెయ్యి సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన ఆయన దేశం గర్వించదగ్గ కళాకారుడని పేర్కొన్నారు. ఎం.ఎస్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతితో అత్యున్నత విలువలు గల ఒక సంగీత శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. -
సినీ సంగీతంలో విశ్వ'నాదం'
ఆయన స్వర పరిచిన పాటల కోసం సంగీతాభిమానులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. శ్రోతల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన సరిగమలు పలికిస్తారు. ఆయన పాటలు విని సంగీతాభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏ చిత్రానికి ఆయన సంగీతం అందించినా శ్రోతలు సంగీత సాగరంలో ఒలలాడాల్సిందే. ఆయనే సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్ ఎం ఎస్ విశ్వనాథన్ (87). చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎం ఎస్ విశ్వనాథన్ మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా శ్వాస కోస వ్యాధితో బాధపడుతున్న ఎం ఎస్‌ను కుటుంబసభ్యులు ఇటీవలే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన ఆరోగ్యం గత మంగళవారం కుదుటపడింది. దాంతో ఎం ఎస్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఎంఎస్‌ను ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన్ని ఐసీయూకి తరలించారు. ఆ క్రమంలో చికిత్స పొందుతూ ఎంఎస్ మరణించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన దాదాపు 750 చిత్రాలకు పైగా ఆయన సంగీత దర్శకత్వం వహించారు.1952లో శివాజీ గణేషన్ హీరోగా నటించిన పానమ్ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత ఎం ఎస్ విశ్వనాథన్ ప్రాణ స్నేహితుడు టీకే రామ్మూర్తితో కలసి 'విశ్వనాథన్ - రామ్మూర్తి' పేరిట ఎన్నో హిట్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత 1965లో విశ్వనాథన్, రామ్మూర్తి ద్వయం విడిపోయింది. అనంతరం ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. తెలుగులో నిర్మించిన తెనాలి రామకృష్ణ, అంతులేని కథ, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం తదితర చిత్రాలకు ఎం ఎస్ స్వర రచన చేశారు. ఎంఎస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ తెలుగు ప్రజలను ఆనందపరవశుల్ని చేశాయి. ఎం ఎస్ విశ్వనాథన్, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ కాంబినేషన్లో వచ్చిన అన్ని చిత్రాల్లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఎం ఎస్ విశ్వనాథన్ భార్య జానకీ 2012లో మరణించారు. ఆ తర్వాత ఆయన మిత్రుడు టీ కే. రామ్మూర్తి మృతి చెందారు. ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించి తనను తాను గౌరవించుకుంది. అలాగే లెక్కకు మిక్కిలి పురస్కారాలు ఎం ఎస్ విశ్వనాథన్‌ను వరించాయి. 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోని ఇలప్పుళిలో ఎంఎస్ విశ్వనాథన్ జన్మించారు. -
సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కన్నుమూశారు. కేరళలో ఆయన 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోగల ఇలప్పుళిలో జన్మించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సీఎస్ సుబ్బరాజన్తో కలిసి దేవదాసు, లైలా మజ్నూవంటి చిత్రాలకు సంగీతం అందించిన విశ్వనాథన్.. సిపాయి చిన్నయ్య, ఇంటికి దీపం ఇల్లాలే, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, సినిమాలకు సంగీతం అందించారు. మొత్తం 1200 చిత్రాలకు పైగా ఆయన సంగీతం అందించారు. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలకు విశ్వనాథన్ సంగీతం అందించారు. -
ఎంఎస్ విశ్వనాథన్ ఆరోగ్యం విషమం
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్.విశ్వనాథన్ (87) ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎంఎస్ విశ్వనాథన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఎంఎస్ విశ్వనాథన్‌ను కుటుంబసభ్యులు రెండు వారాల క్రితం అడయార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన ఆర్యోగం కాస్త మెరుగుపడింది. దీంతో ఆయన్ని ఇంటికి తీసుకువెళ్తామని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఎంఎస్ విశ్వనాథన్ తీవ్ర అనారోగ్యం గురయ్యారు. దాంతో ఆయన్ని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంఎస్ విశ్వనాథన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి ఆయన శిష్యులు, సంగీత జ్ఞాని ఇళయరాజా, ఎస్బీ బాలసుబ్రమణ్యం ఆయన్ని పరామర్శించారు. -
సంగీతం... సముద్రం లాంటిది! ఆకాశం లాంటిది!! భూమి లాంటిది!!!
ఇళయరాజా నేను విన్న తొలి పాట... నా మనసుపై ప్రగాఢమైన ముద్ర వేసిన పాట అంటే మా అమ్మ పాడిన లాలి పాట. ‘ఆరారో ఆరిరారో...’ అంటూ అమ్మ పాడుతూ ఉంటే ఓ కొత్త ప్రపంచంలో తేలియాడుతున్న అనుభూతి. మా పెద్దన్నయ్య పావలర్ వరదరాజన్ జానపద గీతాలు అద్భుతంగా పాడేవాడు. అవే నాలో సంగీతం పట్ల మమకారాన్ని పెంచాయి. మద్రాసు వెళ్లిన కొత్తల్లో... రోజూ ఉదయం ఏడు గంటలు కొట్టేసరికి మద్రాసులో మైలాపూర్ లజ్ కార్నర్ దగ్గర ఓ కారు కోసం ఎదురు చూసేవాణ్ణి. ఎమ్ఎస్వి 5052 నంబర్ కల నల్ల అంబాసిడర్ కారు అది. అందులో ఓ పెద్దాయన కూర్చుండేవారు. ఆయనను చూడగానే నాలో ఏదో పారవశ్యం. ఆయనెవరో కాదు... టాప్ మ్యూజిక్ డెరైక్టర్ ఎమ్మెస్ విశ్వనాథన్. నేను తొలిసారిగా స్వరకల్పన చేసింది సినిమా పాట కాదు. ఓ కవిత. జవహర్లాల్ నెహ్రూ చనిపోవడంతో మద్రాసు మెరీనా బీచ్‌లో సంస్మరణ సభ పెట్టారు. నెహ్రూపై ప్రముఖ గాయకుడు శీర్గాళి గోవింద రాజన్ ఓ కవిత రాసి వినిపించారు. ఆ కవిత నాకు బాగా నచ్చేసింది. రాత్రంతా మేలుకుని, ఆ కవితకు ట్యూన్ కట్టా. అదే నా ఫస్ట్ కంపోజిషన్. నాకు అరగంట టైమిస్తే ఓ సినిమాకు సంగీతం సమకూర్చేయగలను. వాస్తవానికి కంపోజింగ్‌కు 45 నిమిషాలు పడుతుంది. ఆర్కెస్ట్రేషన్‌కు ఇంకో 45 నిమిషాలు. మిగతా సమయం అంతా రిహార్సల్స్‌కు, రికార్డింగ్‌కు సరిపోతుంది. ఒకే సిట్టింగ్‌లో ఆరు పాటలు సునాయాసంగా కంపోజ్ చేయగలను. ఒక్క రోజులో 20 నుంచి 25 పాటల వరకూ కంపోజ్ చేయడం నాకు పెద్ద విషయమేమీ కాదు. ఏ సంగీతమైనా ప్రేక్షకుణ్ణి మరో ప్రపంచానికి తీసుకువెళ్లాలి. శ్రోత మనసంతా ఆ సంగీత మధురిమలతో నిండిపోవాలి. ‘ఈ సంగీతానికి, నాకూ ఏదైనా సంబంధం ఉందా? ఇది నా మనసుకు ఎందుకంతగా దగ్గరవుతోంది?’ అని శ్రోత అనుకోవాలి. ఒకరి భావాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర వ్యక్తీకరించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి. మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరించొచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదని చెబుతాను. నాకు ప్రత్యేకంగా అభిమాన సంగీత దర్శకులు ఒక్కరని లేరు. అందరినీ అభిమానిస్తాను. ఖేమ్‌చంద్ ప్రకాశ్, నౌషాద్... ఇలా అందరి సంగీతాల్నీ ఇష్టపడతాను. వాళ్లు ప్రయాణించిన బాటలోనే నేనూ ప్రయాణిస్తున్నాను. భాషతో సంబంధం లేకుండా చెవులకింపైన సంగీతాన్నిచ్చే ఏ సంగీత దర్శకుడైనా నాకు ఇష్టమే. కె. రాఘవేంద్రరావు వల్లనో, మణిరత్నం వల్లనో, భారతీరాజా వల్లనో... నేను మంచి పాటలు ఇస్తానంటే ఎలా నమ్ముతాను? సినిమాతో నాకున్న కనెక్షన్ దర్శకుడు కాదు. ఆ సన్నివేశం గానీ, క్యారెక్టర్ గానీ కనెక్ట్ అవ్వాలి. కథలోని ఎమోషన్స్ ప్రధానం. నాకు సప్త స్వరాలే ప్రాణం. ‘నాకు సంగీతం తెలియదు. సంగీతానికి నిర్వచనం చెప్పమంటే... ఓ పెద్ద సెమినార్ పెట్టి చెప్పినా సరిపోదు. అయినా సంగీతం కానిదేంటి చెప్పండి. మనం పలికే మాటలోనూ నాకు మ్యూజిక్ వినిపిస్తుంటుంది. ప్రతి మాటకూ, శబ్దానికీ ఒక లయ ఉంటుంది. వాటికీ సప్త స్వరాలుంటాయి. ఒక నిర్దిష్టమైన కాలప్రమాణం కనిపిస్తుంది. పక్షి స్వేచ్ఛగా విహరిస్తుంది. దాన్ని ఫొటోగా తీసుకుని కంప్యూటర్లో ఉంచి... కొన్ని డాట్స్ పెట్టి పక్షి రెక్కలు విప్పినట్టు, వాటిని ఊపుతూ ఎగిరినట్లు చేయచ్చు. సంగీతం మాత్రం కంప్యూటర్ పక్షి లాంటిది కాదు. సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది. ఒక ఆకాశం లాంటిది. ఒక భూమి లాంటిది. ఎంతో విస్తారమైనది సంగీత ప్రపంచం. సముద్రపుటొడ్డున కూర్చుని అక్కడ కనిపించే ఆల్చిప్పల్ని ఏరుకుని వాటిని మాలగా కూర్చి, దానికి మెరుగుపెట్టి అమ్మే పని చేస్తున్నాను నేను. అయితే సంగీత సాగరంలో ఎక్కడెక్కడ ముత్యాలు దొరకుతాయో, సంగీతాకాశంలో వీణ శ్రుతులెక్కడ ఆడుకుంటాయో, ఈ సంగీతం భూమిపై ఎక్కడెక్కడికి వ్యాపించి కళ్లకు కనిపించే దృశ్యాల రూపంలో ప్రభవిస్తుందో నాకు తెలుసు. కానీ దీని గురించి ప్రజలకు వివరించే సందర్భాన్ని భగవంతుడు నాకు ప్రసాదించలేదు. -
స్వరాలకు నేనే దాసోహమయ్యాను
మనిషిని కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం... ఆవేశం... వినోదం... విషాదం... సమయం, సందర్భం ఏదైనా, దానికి గళమిచ్చేది సంగీతం. బలమిచ్చేది సంగీతం. అందుకే, పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఏడు రథాల తేరుపై పయనంలో మనిషి ఎలుగెత్తిన గొంతుకను శాశ్వతం చేసే సంగీతానికి ఇవాళ పండుగ రోజు. ఈ ‘ప్రపంచ సంగీత దినోత్సవం’ సందర్భంగా కొందరు స్వరసారథులు, గళ వారధుల మనసులోని మాటలు... పాటలు... ఇవాళ్టి ‘సాక్షి’ స్పెషల్ ఎమ్మెస్ విశ్వనాథన్ నచ్చిన రాగం: స.. రి.. గ.. మ.. ప.. ద.. ని.. స.. ఇష్టమైన వాద్యాలు: హార్మోనియం, పియానో ఫేవరెట్ సింగర్స్: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, టీఎమ్ సౌందరరాజన్, కేజే ఏసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి సంగీతం గురించి: ‘‘స్వరాలు నాకు ఎప్పుడూ లోబడలేదు. నేనే వాటికి దాసోహమయ్యాను. సంగీతం దేవుడి భాష. దానికి తెలుగు, తమిళం, మలయాళం అనే భేదాలుండవు. బాణీలు ఎక్కడైనా అవే. దానికి మనం రాసుకునే సాహిత్యం ఉంటుంది కదా. అప్పుడు కలుగుతుంది భాషా భేదం.’’ ఎప్పటికైనా కచ్చేరీ చేస్తాను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఫేవరెట్ సింగర్స్: ఎస్. జానకి, ఏసుదాస్, మహమ్మద్ రఫీ, సోనూ నిగమ్ ఇష్టమైన రాగం: యమన్ ఆశయం: నేను కర్ణాటక సంగీత కచ్చేరీ చేస్తే వినాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారాయన. ఎప్పటికైనా కచ్చేరీ చేయాలనేది నా ఆశ, ఆశయం. సంగీతమంటే?: దేవుడు ఏదైనా చేయగలడు. అలాగే సంగీతం ఏదైనా చేయగలదు. ప్రతి రోజూ మ్యూజిక్ డేనే! ఎల్.ఆర్. ఈశ్వరి ‘‘వరల్డ్ మ్యూజిక్ డేనా?... సంగీతానికి ఒక్కరోజు కేటాయించడమేంటి? అసలు ఈ ప్రపంచం, కాలం, మనం.. అంతా సంగీతంతోనే కదా మమేకమైపోయి ఉన్నాం. సంగీతం గురించి ఒక్కరోజు ఏంటి? ఎన్ని రోజులైనా మాట్లాడాలి. అసలు మన ప్రాణం, ప్రయాణం అంతా సంగీతంతోనే ముడిపడి ఉంది. అమ్మ పాడే లాలిపాటతో మొదలైన మన జీవితం చివరి క్షణం వరకూ సంగీతంతోనే ముడిపడి ఉంటుంది. అసలు సంగీతం లేని జీవితం ఉంటుందా? పాట పాడితేనే కాదు.. మన మాట కూడా సంగీతమే. మనం చేసే ఏ శబ్దంలోనైనా సంగీతాన్ని చూస్తాను. సంగీతంతో నా జీవితం అంతగా మమేకమైపోయింది. ఏ పాట పాడినా మధురానుభూతికి లోనవుతుంటా. మనం పాడే పాటలు ఇతరుల కోసం అని నేననుకోను. పాడటంలో ముందు నేను ఆనందం పొందుతాను. ఆ తర్వాత శ్రోతలు ఆనందపడతారు.’’ రఫీ కలెక్షన్ మొత్తం ఉంది ఎస్.పి. శైలజ ఫేవరెట్ సింగర్: మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ సింగర్ మహ్మద్ రఫీ. ఆ తర్వాత పి.సుశీల, ఎస్.జానకి అంటే ఇష్టం. నా దగ్గర రఫీ కలెక్షన్ మొత్తం ఉంది. సంగీత దర్శకత్వం: సంగీతమే నాకు సరిగ్గా రాదు. ఇక సంగీత దర్శకత్వం ఎక్కడ చేస్తాను? సింగర్‌గా: సినిమాలకు పాడటం తగ్గిపోయింది. బాపుగారు డెరైక్ట్ చేసిన ‘సుందరకాండ’ తర్వాత నేను మళ్లీ సినిమా పాట పాడలేదు. అన్నీ ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్సే. టీవీ షోస్, ఫారిన్ ట్రిప్స్ కామనే.