నిర్మాతకు రెండోసారీ కరోనా పాజిటివ్‌

Producer Karim Morani Tests Covid 19 Positive For Second Time - Sakshi

బాలీవుడ్‌ నిర్మాత కరీమ్‌ మొరానీకి రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ కరోనా(కోవిడ్‌-19) పాజిటివ్‌గా తేలింది. తొలుత కరీమ్‌ కుమార్తెలు జోవా, షాజాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక విదేశాల నుంచి వచ్చిన కూతురి ద్వారా కరీంకు కరోనా సోకినట్లు భావిస్తున్న తరుణంలో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరీం మాత్రం ఇంకా వైరస్‌ బారి నుంచి కోలుకోలేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.(ఆస్పత్రి నుంచి నిర్మాత కుమార్తెల డిశ్చార్జ్)

కాగా ఇప్పటికే కరీం(60)కు రెండుసార్లు హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు బైపాస్‌ సర్జరీ కూడా నిర్వహించారని.. కరోనా ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక షాజా, జోవా డిశ్చార్జ్‌ అయినప్పటికీ వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. ఈవెంట్‌ మేనేజర్‌గా వ్యవహరించిన కరీం‘యోధ’సినిమాతో 1991లో నిర్మాతగా మారారు. ఆ తర్వాత షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’(2013), ‘దిల్‌వాలే’ (2015) చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా, ‘రా.వన్‌’(2011), ‘హ్యాపీ న్యూఇయర్‌’ (2014) చిత్రాలకు అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి.. బాద్‌షా సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top