ఆసక్తికరంగా ‘శుభలేఖ+లు’ | Priya Vadlamani Shubhalekha Plus Lu Teaser | Sakshi
Sakshi News home page

Jun 20 2018 12:46 PM | Updated on Jun 27 2018 1:54 PM

Priya Vadlamani Shubhalekha Plus Lu Teaser - Sakshi

శుభలేఖ+లు సినిమాలో ప్రియా వడ్లమాని

విభిన్న ఆలోచనలతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘శుభలేఖ+లు’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకుడు. నూతన నటి ప్రియా వడ్లమానిని నిత్య పాత్రలో పరిచయం చేస్తూ ఓ ఆసక్తికర టీజర్‌ను రిలీజ్ చేశారు.

నిత్య పాత్రను మోడ్రన్ అమ్మాయిగా పరిచయం చేశారు. పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న అమ్మాయి సిగరెట్ తాగుతూ కనిపించటం చూస్తే కథా కథనాలు బోల్డ్‌గా ఉండబోతున్నాయని అర్ధమవుతోంది. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు కే ఎమ్‌ రాథాకృష్ణన్‌ సంగీతమందిస్తున్నారు.శ్రీనివాస సాయి, దీక్షా శర్మ, వంశీ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement