పదేళ్ల తర్వాత! | Prakash Raj Joined for Ram charan and Sukumar Movie Shoot | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత!

May 17 2017 11:45 PM | Updated on Sep 5 2017 11:22 AM

పదేళ్ల తర్వాత!

పదేళ్ల తర్వాత!

సాధారణంగా నా సినిమాలు చూస్తే సీనియర్‌ నటులు ఎవరూ ఉండరు. ఎందుకంటే.. డైరెక్టర్‌ అనేవాడు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తుంటాడు.

‘‘సాధారణంగా నా సినిమాలు చూస్తే సీనియర్‌ నటులు ఎవరూ ఉండరు. ఎందుకంటే.. డైరెక్టర్‌ అనేవాడు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తుంటాడు. సీనియర్‌ నటులు చాలా సినిమాలు చేస్తుంటారు. ఆ అనుభవంతో ఏ డైరెక్టర్‌ ఏ షాట్‌ ఎలా తీస్తాడో వాళ్లు తెలుసుకుంటారు. వాళ్లు సెట్‌లో ఉంటే నేను షాట్‌ తీస్తున్నప్పుడు కరెక్ట్‌గా తీస్తున్నానా? లేదా? అని వాళ్లు అనుకుంటున్నారేమో అని నాకు భయమేస్తుంటుంది.

ఈ భయాలు ఎందుకురా బాబూ అని నేను సీనియర్‌ నటులను తీసుకోను’’ అని ‘మన ఊరి రామాయణం’ చిత్రం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో దర్శకుడు సుకుమార్‌ అన్నారు. సీనియర్స్‌ పట్ల తనకున్న గౌరవాన్ని ఆ విధంగా సుకుమార్‌ చెప్పారు. కానీ, క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకు సీనియర్స్‌ని తీసుకుంటున్నారాయన. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌ హీరోగా తాను తెరకెక్కిస్తున్న సినిమాకి ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నారట.

 పదేళ్ల క్రితం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగడం’ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ నటించారు. కానీ, అందులోది చిన్న పాత్రే. కేవలం రెండు రోజుల్లో ప్రకాశ్‌రాజ్‌ షూటింగ్‌ పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలసి పనిచేయలేదు. ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నది నిజమే అయితే చాలా గ్యాప్‌  తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌ కుదిరిందనొచ్చు. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత రామ్‌చరణ్‌తోనూ, ‘జగడం’ తర్వాత సుకుమార్‌తోనూ ప్రకాశ్‌రాజ్‌కి ఇది రెండో సినిమా అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement