బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరోసారి పోలీసులు

Police Entry in Tamil Biggboss For Meera Mithun - Sakshi

తమిళనాడు, పెరంబూరు: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరోసారి పోలీసులు ప్రవేశించారు. దీంతో ఆ హౌస్‌లో కలకలం రేగింది. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. రియాలిటీ షో తొలి సీజన్‌లోనే నటి ఓవియా, నటుడు ఆరవ్‌ ప్రేమ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. ఆరవ్‌ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్న మనస్థాపంతో ఓవియా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందనే ప్రచారం హోరెత్తింది. ఓవియను అంబులెన్స్‌లో ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ తరువాత గత ఏడాది జరిగిన సీజన్‌– 2లోనూ నటుడు దాడి బాలాజీ, భార్య వివాదం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌– 3లో పాల్గొన్న నటి వనితావిజయకుమార్‌ తన కూతురిని కిడ్నాప్‌ చేసిందన్న ఆరోపణతో హైదరాబాద్‌ పోలీసులు, చెన్నై పోలీసులు విచారణలో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నటి వనితావిజయకుమార్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆమె కూతురు వాగ్మూలంతో వనితా విజయకుమార్‌ అరెస్ట్‌ నుంచి తప్పించుకుంది. తాజాగా నటి మీరా మిథున్‌ డబ్బు మోసం కేసులో పోలీసులు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు.

ఈ గేమ్‌ షోలో పాల్గొన్న నటి మీరా మిథున్‌ ఇటీవల దక్షిణ భారత అందాల పోటీలను నిర్వహించతలపెట్టి పోలీస్‌కేసుల వరకూ వెళ్లి వివాదాల నటిగా పేరు తెచ్చుకుంది. తరువాత ఈ అమ్మడు ఒక వ్యక్తికి అందాల పోటీలకు డిజైనర్‌గా అవకాశం ఇస్తానని చెప్పి రూ.50 వేలు అతని నుంచి తీసుకుందట. డిౖజైనింగ్‌ పని ఇవ్వలేదు, తీసుకున్న డబ్బు ఇవ్వలేదంటూ ఆ వ్యక్తి తేనంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. దీంతో నటి మీరా మిథున్‌ పోలీసులు తను అరెస్ట్‌ చేయకుండా చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకుంది. అందులో తాను మోసం చేశానన్న ఆరోపణలో నిజం లేదని, ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నానని, బయటకు రాగానే తనపై కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని, పోలీసుల విచారణకు సహకరిస్తానని పేర్కొంది. దీంతో ఈ అమ్మడికి ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడంతో ఊపిరి పీల్చుకుంది. అటాంటిది గురువారం అనూహ్యంగా పోలీసులు నటి మీరామిథున్‌ను విచారించడానికి బిగ్‌బాస్‌ హైస్‌లోకి ప్రవేశించారు. దీంతో నటి మీరామిథున్‌ అరెస్ట్‌ అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆమెను అరెస్ట్‌ చేసే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్దారించలేదు. మొత్తం మీద బిగ్‌బాస్‌ హౌస్‌లో మరోసారి కలకలానికి దారి తీసింది ఈ సంఘటన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top