వెండితెరపై రాధే మా లీలలు | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 11:14 AM

Payal Ghosh To Play Role Inspired By Radhe Maa - Sakshi

ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్‌ ల ట్రెండ్ నడుస్తోంది. చారిత్రక ఘట్టాలతో పాటు వివాదాస్పద వ్యక్తుల జీవితాలను కూడా తెర మీద ఆవిష్కరించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వివాదాస్పద మాతాజీ జీవిత కథ వెండితెర మీదకు రానుందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన రాధే మా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందనుందట.

ఈ సినిమాలో రాధే మాగా పాయల్‌ ఘోష్ నటించనుంది. జై మాతా దీపేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్‌ లీడ్ యాక్టర్‌గా నటిస్తోంది. పటేల్‌ కి పంజాబీ షాదీ సినిమాలో పాయల్ పర్ఫామెన్స్‌ నచ్చటంతో దర్శకుడు సౌరభ్‌ వర్మ..  జై మాతాదీలో మెయిన్‌ హీరోయిన్‌ గా ఛాన్స్‌ ఇచ్చారట. అయితే ఈ సినిమా రాధే మా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ఇంత వరకు ప్రకటించలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement