పవన్ నిర్మాత.. చరణ్ హీరో..! | Pawan Producer, Ram Charan Hero | Sakshi
Sakshi News home page

పవన్ నిర్మాత.. చరణ్ హీరో..!

Mar 1 2015 10:56 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ నిర్మాత.. చరణ్ హీరో..! - Sakshi

పవన్ నిర్మాత.. చరణ్ హీరో..!

మెగా అభిమానులందరూ పండగ చేసుకునే వార్త ఇది. అసలిలాంటి వార్తను వాళ్లు ఊహించరు కూడా.

మెగా అభిమానులందరూ పండగ చేసుకునే వార్త ఇది. అసలిలాంటి వార్తను వాళ్లు ఊహించరు కూడా. ఆదివారం అలా ఎవరూ ఊహించని ట్విస్ట్‌నే ఇచ్చారు పవన్ కల్యాణ్. రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నారు పవన్. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ ప్రకటన తెలుసుకున్న మెగా అభిమానులు ‘కాంబినేషన్ కేక’ అనుకోకుండా ఉండలేరు. ఇదిలా ఉంటే... యవ హీరోలతోనూ, కొత్త దర్శకులతోనూ పవన్ కల్యాణ్ సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాదీ, డెక్కనీ వంటి లోకల్ చిత్రాలను కూడా నిర్మించాలనే ఆలోచన ఉందని కూడా ఆ ప్రకటనలో తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement