రాజమౌళి సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్? | Pawan Kalyan's heroine in SS Rajamouli movie? | Sakshi
Sakshi News home page

రాజమౌళి సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్?

Nov 8 2013 12:22 PM | Updated on Mar 22 2019 5:33 PM

రాజమౌళి సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్? - Sakshi

రాజమౌళి సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్?

పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాతో హీరోయిన్ ప్రణీత దశ తిరిగింది.

పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాతో హీరోయిన్ ప్రణీత దశ తిరిగింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కందిరీగ’ఫేం సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిన 'రభస' సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర ఇప్పటికే ఆమెను వరించింది. అత్తారింటికి దారేది’ తర్వాత సమంత, ప్రణీత కలిసి నటిస్తున్న సినిమా ఇదే.

ప్రణీతకు మరో బంఫర్ ఆఫర్ వచ్చినట్టు టాలీవుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. విజయాన్ని ఇంటి పేరుగా మార్చకున్న ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి'లో ఈ 'బాపుగారి బొమ్మ'కు అవకాశం దక్కినట్టు చెప్పుకుంటున్నారు. రానా దగ్గుబాటి సరసన నటించే హీరోయిన్ కోసం చాలా మంది పేర్లు పరిశీలించిన ఈ సినిమా జక్కన్న 'అత్తారింటికి దారేది' చూసి ప్రణీతను ఓకే చేశారట. ఇదే నిజమయితే ప్రణీత పంట పండినట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement