శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అభినందనలు | Pawan Kalyan congratulated comedian Srinivas reddy | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అభినందనలు

Feb 2 2017 3:11 PM | Updated on Mar 22 2019 5:33 PM

శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అభినందనలు - Sakshi

శ్రీనివాస్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అభినందనలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్ గా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాని చూసారు.  కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా క్లీన్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది.

జయమ్ము నిశ్చయమ్ము రా లో " అత్తారింటికి దారేది" సినిమా కూడా ఒక కీ రోల్ పోషించింది. ఆ సినిమా బ్యాక్ డ్రాప్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ని డిజైన్ చేసాడు దర్శకుడు శివాజి. ఆ సీన్స్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా లొనే పవన్ ఇమేజ్  కొన్ని సన్నివేశాలు బలం అందించింది. ఇప్పటికే సినిమా మంచి విజయం సాధించగా.., ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశంసలు కూడా లభించాయి.

'నువ్వొక మంచి సినిమా చేశావు. సినిమా చూసి ఎంజాయ్ చేశాను. నీకు నా బెస్ట్ విషెస్' అని అభినందిస్తూ ఒక ఫ్లవర్ బొకేని శ్రీనివాస్ రెడ్డికి పంపారు పవర్ స్టార్. తనను అభినందించిన పవర్ స్టార్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశాడు శ్రీనివాస్ రెడ్డి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement