మీరా జాస్మిన్ పెళ్లి నమోదుకు చిక్కులు | Officials Refuse To Register Meera Jasmine’s Marriage | Sakshi
Sakshi News home page

మీరా జాస్మిన్ పెళ్లి నమోదుకు చిక్కులు

Aug 5 2014 11:57 PM | Updated on Sep 2 2017 11:25 AM

మీరా జాస్మిన్ పెళ్లి నమోదుకు చిక్కులు

మీరా జాస్మిన్ పెళ్లి నమోదుకు చిక్కులు

నటి మీరా జాస్మిన్ వివాహం నమోదుకు రిజిస్టర్ అధికారులు నో అనడం చర్చనీయాంశంగా మారింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషలన్నింటిలోను ప్రముఖ హీరోయిన్‌గా

 నటి మీరా జాస్మిన్ వివాహం నమోదుకు రిజిస్టర్ అధికారులు నో అనడం చర్చనీయాంశంగా మారింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషలన్నింటిలోను ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన నటి మీరా జాస్మిన్. ఈమె వ్యక్తిగత జీవితం పలు మలుపులు తిరిగి చివరికి అనిల్ జాన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ముడిపడింది. ప్రముఖ మాండలిన్ సంగీత కళాకారుడు రాజేష్‌తో మీరా జాస్మిన్ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. మీరాజాస్మిన్-అనిల్ జాన్‌ల వివాహం గత ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న చర్చిలో జరిగింది.
 
 అయితే వీరి వివాహాన్ని ప్రభుత్వ కార్పొరేషన్ అధికారులు నమోదు చేయలేదు. అందుకు కారణం అనిల్ జాన్‌కిది రెండో వివాహం అన్న సందేహమే. దీనిపై రిజిస్ట్రార్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ, ఇటీవల మీరాజాస్మిన్, అనిల్‌జాన్ తమ వివాహ నమోదు సమస్య గురించి అడగడానికి తమ కార్యాలయానికి వచ్చారని తెలిపారు. వివాహం జరిగిన 45 రోజుల తరువాత వివాహం నమోదు చేయడానికి వచ్చిన వారిని విచారించడం అన్నది సాధారణ విషయం అన్నారు.
 
 నటి మీరాజాస్మిన్ ప్రస్తుతం చిత్రాల్లో నటించడం లేదన్నారు. భర్తతో కలిసి దుబాయ్‌లో నివశిస్తున్న ఆమెను వివాహ నమోదు సమస్య గురించి ప్రశ్నించగా ఆమె ఎలాంటి బదులు ఇవ్వలేదని తెలిపారు. ఈ కారణంగానే వారి వివాహాన్ని చట్టబద్దంగా నమోదు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనిల్ జాన్ ఇంతకు ముందు బెంగళూర్‌కు చెందిన ఒక యువతితో పెళ్లికి సిద్ధం అయ్యారని అయితే కొన్ని కారణాల వల్ల ఆ వివాహం ఆగిపోయింది.
 
 ఆ యువతి కుటుంబ సభ్యులు తమ వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని పెళ్లి సమయంలో అనిల్ జాన్ పోలీసుల రక్షణ కోరారు. మరో విషయం ఏమిటంటే అనిల్ జాన్‌కు బెంగళూర్‌కు చెందిన యువతికి వివాహం అయినట్లు నటి మీరాజాస్మిన్, అనిల్ జాన్‌కు రెండో భార్య అనే విషయం ప్రచారంలో ఉంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement