2.ఓ టీంకు డెడ్‌లైన్‌..! | October 14 Is The Deadline For 2 O VFX Team | Sakshi
Sakshi News home page

Sep 22 2018 10:01 AM | Updated on Nov 3 2018 1:48 PM

October 14 Is The Deadline For 2 O VFX Team - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 2.ఓ. ఇదే కాంబినేషన్‌లో రూపొందిన రోబో సినిమాకు సీక్వెల్‌గా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇటీవల దర్శకుడు శంకర్‌ సినిమాను నవంబర్‌ నెలాఖరున రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌ ఉండటంతో నవంబర్‌లో కూడా రిలీజ్‌ అవుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీంతో చిత్రయూనిట్‌ అలర్ట్‌ అయినట్టుగా సమాచారం. మరోసారి వాయిదా పడితే సినిమా మీద నెగెటివ్‌ టాక్‌వస్తుందని భావిస్తున్న టీం ఎట్టి పరిస్థితుల్లో నవంబర్‌లో సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే గ్రాఫిక్స్‌ టీంకు అక్టోబర్‌ 15 కల్లా వర్క్‌ పూర్తి చేయాలని డెడ్‌లైన విధించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి అనుకున్నట్టుగా ఈ సారైన 2.ఓ రిలీజ్‌ అవుతుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement