తెలివైన థామస్‌ | Nivetha Thomas set to return | Sakshi
Sakshi News home page

తెలివైన థామస్‌

Apr 7 2018 1:20 AM | Updated on Oct 2 2018 6:27 PM

Nivetha Thomas set to return - Sakshi

నివేథా థామస్‌

కొంతమంది హీరోయిన్స్‌ సినిమాల్లోకి రాగానే చదువుని పక్కన పెట్టేస్తారు. కానీ నివేథా థామస్‌ సినిమాలను పక్కన పెట్టారు. డిగ్రీ కంప్లీట్‌ చేయాల్సిందే అనుకున్నారు. ‘నిన్ను కోరి, జై లవకుశ’ సినిమాలతో లాస్ట్‌ ఇయర్‌ తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ మలయాళీ కుట్టి కేవలం అందంతోనే కాదు.. అభినయంతోనూ మంచి మార్కులు కొట్టేశారు. ఈ సంవత్సరం మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఒక్క సినిమా కూడా సైన్‌ చేయలేదు. దీనికి కారణం ఏంటి? అని ఫ్యాన్స్‌ అడుగుతున్నారు.

‘‘నా నెక్ట్స్‌ సినిమా ఏంటీ అని అందరూ అడుగుతున్నారు. త్వరలో అనౌన్స్‌ చేస్తాను. ‘జై లవకుశ’ తర్వాత నా గ్రాడ్యుయేషన్‌ లాస్ట్‌ సెమిస్టర్‌ కంప్లీట్‌ చేశా. ఈ గ్యాప్‌లో చాలా స్క్రిప్ట్‌లు చదివాను, విన్నాను. త్వరలోనే ఓ సినిమా డీటైల్స్‌ షేర్‌ చేస్తాను’’ అన్నారు నివేథా. చెన్నై ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్‌ ఫైనల్‌ ఇయర్‌ కంప్లీట్‌ చేశారు. ఎన్ని మంచి ఆఫర్స్‌ వచ్చినా ‘ఎడ్యుకేషన్‌ ఈజ్‌ ఫస్ట్‌’ అని డిగ్రీ కంప్లీట్‌ చేశారంటే నివేథా థామస్‌ బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ అనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement