నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం | Nithya Shetty interview about Padesave | Sakshi
Sakshi News home page

నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం

Feb 15 2016 10:38 PM | Updated on Aug 20 2018 6:18 PM

నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం - Sakshi

నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం

బాల నటిగా చేసినప్పుడు షూటింగ్ లొకేషన్‌లో అందరూ గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడెంతో ఇష్టంగా చాక్లెట్లు

 ‘‘బాల నటిగా చేసినప్పుడు షూటింగ్ లొకేషన్‌లో అందరూ గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడెంతో ఇష్టంగా చాక్లెట్లు తిన్న నేను ఇప్పుడు మాత్రం వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి కదా’’ అని నవ్వుతూ అన్నారు నిత్యాశెట్టి. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, సమీర ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘పడేసావే’. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిత్యాశెట్టి చెప్పిన ముచ్చట్లు...
 
  ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఇందులో నీహారిక పాత్రలో నటించాను. ఇందులో మాది చిన్న లవ్‌స్టోరీనే అయినా చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ప్రేమ అంటే జిగ్సా పజిల్ లాంటిది. నా మొదటి సినిమాకే అనూప్ రూబెన్స్ గారు సంగీతం అందించడంతో చాలా ఆనందంగా ఉంది.  చునియా డెరైక్టర్ మాత్రమే కాదు నాకు మంచి ఫ్రెండ్. ఆమెతో పనిచేయడం కంఫర్టబుల్‌గా ఫీలయ్యా. కార్తీక్ సెట్స్‌లో ఎంతో ఫన్ చేసేవాడు.

ఈ చిత్రంలో ఇంకో కథానాయికగా నటించిన సమీర నాకు మంచి ఫ్రెండ్ అయింది. కాశ్మీర్ అమ్మాయి అయినా తెలుగు రాకపోయినా చక్కగా డైలాగ్స్ చెప్పింది. మా ఇద్దరి పాత్రలకీ సమాన ప్రాధాన్యం ఉంటుంది.  నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయన ఈ చిత్రంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ సరసన ‘శోభన్‌బాబు’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యా. అలాగే తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement