‘నిజాన్ని నిజం అని​ ఫ్రూవ్‌ చేయడం చాలా కష్టం’ | Nikhil Siddharth Arjun Suravaram Teaser Released | Sakshi
Sakshi News home page

‘జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్‌’

Mar 4 2019 5:46 PM | Updated on Mar 4 2019 5:54 PM

Nikhil Siddharth Arjun Suravaram Teaser Released - Sakshi

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న నిఖిల్‌.. కిరాక్‌ పార్టీతో ఆశించిన మేర విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు. అయితే తమిళ్‌ హిట్‌ మూవీ కణితణ్‌ రీమేక్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ మూవీ టైటిల్‌ విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి చిత్రయూనిట్‌ వెనక్కితగ్గి.. ‘అర్జున్‌ సురవరం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌తో అంచనాలు క్రియేట్‌ చేసిన ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

ఒక అబద్దాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ ఒక నిజాన్ని నిజం అని​ ఫ్రూవ్‌ చేయడం చాలా కష్టం’.. ‘జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్‌’..‘వెతికేవాడు దొరకట్లేదు.. వెతకాల్సినవాడు తెలియట్లేదు..’ లాంటి మాటలతో ఆసక్తిగా ఉన్న టీజర్‌ ఆకట్టుకునేలానే ఉంది.  ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఠాగుర్‌ మధు నిర్మిస్తున్న ఈ మూవీని సంతోష్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ టీజర్‌ను రిలీజ్‌ చేసే క్రమం‍లో టెక్నికల్‌ ఇబ్బందులు ఎదురయ్యేసరికి కాస్త ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో నిఖిల్‌చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. సాంకేతిక లోపం వల్ల కాస్త ఆలస్యం కానుందని లహరి మ్యూజిక్‌ సంస్థ చేసిన ట్వీట్‌కు నిఖిల్‌ రిప్లై ఇస్తూ.. ‘అందుకే జియోకి మారమనేది.. నేను కూడా టీజర్‌ గురించి వెయిట్‌ చేస్తున్నా’నంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement