పరువు హత్యల నేపథ్యంలో... | New telugu moive for Honor killings | Sakshi
Sakshi News home page

పరువు హత్యల నేపథ్యంలో...

Oct 17 2018 12:43 AM | Updated on Oct 17 2018 12:43 AM

New telugu moive for Honor killings - Sakshi

రాఘవ్, కరోణ్య కత్రిన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కోటేంద్ర దుద్యాలను దర్శకునిగా పరిచయం చేస్తూ, కె.ఎం.డి.షఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ– ‘‘రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. పరువు హత్యల నేపథ్యంలో ఉంటుంది. ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకుంటే జీవితాలు అందంగా ఉంటాయి.

తాజాగా జరిగిన పరువు హత్య ప్రణయ్‌ విషయంలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన పద్ధతిలో ముగింపు ఎలా ఉండాలో మావంతు ప్రయత్నంగా ఈ సినిమాలో చూపించాం. మంచి ప్రేమ కథ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్‌ మరువలేనిది’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement