ఎక్కడికి వెళ్తున్నావ్‌ డోరా? | Nayanthara 's 'Dora' single from Dec 16 | Sakshi
Sakshi News home page

ఎక్కడికి వెళ్తున్నావ్‌ డోరా?

Dec 16 2016 11:55 PM | Updated on Sep 4 2017 10:53 PM

ఎక్కడికి వెళ్తున్నావ్‌ డోరా?

ఎక్కడికి వెళ్తున్నావ్‌ డోరా?

ముఖంలో ఆందోళన, నుదుట రక్తం... ఒంటరిగా కారు నడుపుతూ ఎక్కడికో వెళ్తున్నారు నయనతార.

ముఖంలో ఆందోళన, నుదుట రక్తం... ఒంటరిగా కారు నడుపుతూ ఎక్కడికో వెళ్తున్నారు నయనతార. ఇంత కంగారుగా ఎక్కడికెళుతున్నారని ఏవేవో ఊహించుకోవద్దు. కొత్త సినిమా కోసమే నయనతార బయలుదేరారు. ఈ బ్యూటీ ముఖ్యతారగా రూపొందుతోన్న తమిళ హారర్‌ కామెడీ మూవీ ‘డోరా’. ఇక్కడున్న స్టిల్‌ చూస్తే.. పెద్ద గండం నుంచి నయన తప్పించుకుని వెళ్తున్నట్టుంది కదూ! ఈ సిట్యువేషన్‌కి తగ్గట్టు సినిమాలో ‘ఎంగ పోర డోరా’ (‘ఎక్కడికి వెళ్తునావ్‌ డోరా’ అని అర్థం) అనే పాటను స్వరపరిచారు.

శుక్రవారం ఈ పాటను విడుదల చేశారు. పాట విన్న ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ‘మాయ’ (తెలుగులో ‘మయూరి’) తర్వాత నయనతార ప్రధానపాత్రలో నటిస్తున్న హారర్‌ చిత్రమిది. కొత్త కుర్రాడు దాస్‌ రామసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌–మెర్విన్‌ ద్వయం సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement