గొంతు సవరించుకుని.. | Nayantara dubs in her own voice | Sakshi
Sakshi News home page

గొంతు సవరించుకుని..

Jun 11 2014 12:27 AM | Updated on Sep 2 2017 8:35 AM

గొంతు సవరించుకుని..

గొంతు సవరించుకుని..

సంచలన తార నయనతార ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఈ బ్యూటీ బహుభాషా నటికూడా. పలు చిత్రాలు చేశారు. ఇప్పటి వరకు ఏ భాషలోనూ ఆమె తన పాత్రలకు అరువు గొంతే.

సంచలన తార నయనతార ఇప్పుడు స్టార్ హీరోయిన్.  ఈ బ్యూటీ బహుభాషా నటికూడా. పలు చిత్రాలు చేశారు. ఇప్పటి వరకు ఏ భాషలోనూ ఆమె తన పాత్రలకు అరువు గొంతే. కాగా ఇన్నాళ్లకి ఈ అమ్మడు సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదీ తమిళ చిత్రానికి. అందులోనూ తన మాజీ ప్రియుడి సరసన చిత్రానికి డబ్బింగ్ చెప్పనుండడం విశేషం. ఆ చిత్రం ఏమిటో ఈ పాటికే పాఠకులకు అర్థమైపోయి ఉంటుం ది.
 
 ఎస్.నమ్మఆళు చిత్రంలో తన పాత్రకు నయనతారే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఓకే అన్నారు. ఇందుకామె తన గొంతును సవరించుకుంటున్నారు. చిన్న పాటి తర్ఫీదు కూడా తీసుకుంటున్నారట. శింబు, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ఇదునమ్మ ఆళు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి శింబు తమ్ముడు కురలరసన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
 
 నయనతార పాత్రకు ఆమే డబ్బింగ్ చెబితే బాగుంటుందని దర్శకుడు భావించారట. ఆలోచన వచ్చిందే తడువుగా నయనతారను సంప్రదించగా మొదట సంకోసించిన ఈ ముద్దుగుమ్మ దర్శకుడి ప్రోద్బలంతో ఓకే చెప్పిందని సమాచారం. అయితే చిత్ర షూటింగ్ అయిపోతే అంతటితో తనపని పూర్తయ్యిందని నయనతార భావించేది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకూ హాజరయ్యేది కాదు. అలాంటిది ఇదు నమ్మ ఆళు చిత్రానికి ఏకంగా డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement