రకూల్‌

Nagarjuna being unhappy over Rakul Preet's slim and hot look - Sakshi

పోర్చుగల్‌లో షూటింగ్‌కు అంతా అనువుగా ఉన్నప్పటికీ ‘మన్మథుడు 2’ టీమ్‌లో మాత్రం హాట్‌ హాట్‌ వాతావరణం ఉందని, అందుకు కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగే కారణమనే వార్తలు రెండు రోజులుగా నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తెలిసింది. అంత కూల్‌గానే సాగుతోందట. నాగార్జున హీరోగా ‘చి..ల..సౌ’ ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాగ్‌ సరసన రకుల్ర్‌ పీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. అయితే రకుల్‌ నటన పట్ల టీమ్‌ సంతృప్తిగా లేదనే పుకార్లు చక్కర్లు కొట్టాయి.

ఈ విషయంపై రాహుల్‌ రవీంద్రన్‌ కూడా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. పోర్చుగల్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ అయిన తొలి రోజు నుంచే రకుల్‌ మా టీమ్‌తో ఉన్నారు. ఆమె మంచి ప్రతిభాశాలి. అద్భుతంగా నటిస్తోంది. టీమ్‌ అందరం హ్యాపీగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. సో.. ర‘కూల్‌’ అన్నమాట. ఇక్కడ ఇన్‌సెట్‌లో ఉన్న నాగార్జున ఫొటోను రాహుల్‌ రవీంద్రన్‌ షేర్‌ చేసి, ‘ఈ ఒక్క సీన్‌ మీ కోసమే’ అని ట్వీట్‌ చేశారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ‘మన్మథుడు 2’ సీక్వెల్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని నాగార్జున, పి. కిరణ్‌ నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top