అప్పుడు సైకిల్‌ చైన్‌... ఇప్పుడు లాఠీ! | Nagarjuna and Ram Gopal Varma team up after 25 years, filming | Sakshi
Sakshi News home page

అప్పుడు సైకిల్‌ చైన్‌... ఇప్పుడు లాఠీ!

Nov 4 2017 1:00 AM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna and Ram Gopal Varma team up after 25 years, filming  - Sakshi

యస్‌... సైకిల్‌ చైన్‌కి, లాఠీకి లింక్‌ కుదిరింది. ఎలాగంటే? రామ్‌గోపాల్‌ వర్మ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద ట్రెండ్‌ సెట్టరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘శివ’లో స్టూడెంట్‌గా చేసిన నాగార్జున చేత సైకిల్‌ చైన్‌ లాగించారు వర్మ. అయితే, ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న సినిమాలో నాగార్జున చేత లాఠీ పట్టిస్తున్నారు వర్మ. వర్మ దర్శకత్వంలో చాలా గ్యాప్‌ తర్వాత హీరోగా నటిస్తున్న సినిమాలో లాఠీ పట్టి రఫ్పాడించే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌లో నాగార్జున కనిపించబోతున్నారు.

‘‘వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే స్టైలిష్‌ యాక్షన్‌ డ్రామాలో పోలీసాఫీసర్‌గా నటించబోతున్నా’’ అని నాగ్‌ పేర్కొన్నారు. అంతేకాదు... ‘‘1988లో ఆర్జీవీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు చాలామంది షాకయ్యారు. డిఫరెంట్‌గా ఆలోచించారు. ఇప్పుడీ 2017లో కూడా చాలామంది హ్యాపీగా ఫీలైతే... ఎక్కువమంది షాకయ్యారు. లెట్స్‌ రాక్‌ రామూ’’ అని నాగార్జున పేర్కొన్నారు. ‘‘నాగ్‌... నువ్వెప్పుడూ తక్కువగా మాట్లాడతావు. నేనే ఎక్కువగా మాట్లాడతా. ఇప్పుడు రోల్స్‌ మార్చుకుందాం. సినిమానే మాట్లాడుతుంది’’ అని నాగ్‌కి రిప్లై ఇచ్చారు వర్మ. ఈ నెల 20న ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

రివెంజ్‌ కంప్లీట్‌!
‘‘నేను దర్శకుణ్ణి అవుతానంటే మా నాన్నగారు నమ్మలేదు. అందుకే, ‘శివ’ ముహూర్తపు సన్నివేశానికి నాన్నతో క్లాప్‌ కొట్టించి, రివెంజ్‌ తీర్చుకున్నా. మా అమ్మగారు నాకు ఏమీ రాదంటుంటారు. అందుకే నాగ్‌తో స్టార్ట్‌ చేయబోయే నా కొత్త సినిమాకి మా అమ్మగారితో క్లాప్‌ కొట్టించాలనుకుంటున్నాను. రివెంజ్‌ కంప్లీట్‌!’’ అని వర్మ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement