టాలీవుడ్‌లో మరో ‘దేవదాసు’?

Nagarjuna And Nani Film Titled Devadasu - Sakshi

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  నాగార్జునకు సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65 శాతానికి పైగా పూర్తయ్యింది.

నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించనున్న ఈ సినిమాకు దేవదాసు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్‌లో దేవదాసు పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. దేవదాస్‌ నవల ఆధారంగా ఏఎన్నార్‌, కృష్ణలుదేవదాసు పేరుతో సినిమాలు చేశారు. ఈ జనరేషన్‌లో రామ్‌ హీరోగా వైవీయస్‌ చౌదరి దర్శకత్వంలో దేవదాసు సినిమా రూపొందింది. ఇప్పుడు మరోసారి నాగార్జున, నానిల మల్టీస్టారర్‌కు దేవదాసు టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ టైటిల్‌ పై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top